నగరంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని బెహ్రంపాడ మురికివాడల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 16 ఫైర్‌ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.