అంతిమ విజయం సాధించలేదు: అలియా
ముంబై: అంతిమ విజయం(అల్టిమేట్ సక్సెస్) ఇంకా చవిచూడలేదని బాలీవుడ్ నటి అలియా భట్ పేర్కొంది. 2011లో తెరగ్రేటం చేసిన అలియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసినప్పటికీ తానింకా అంతిమ విజయం సాధించలేదని చెప్పింది. తానందుకున్న విజయాలు స్వల్పమని, వాటితోనే విర్రవీగబోనని తెలిపింది.
సక్సెస్ సాధించిన వ్యక్తిని తన తండ్రి మహేష్ భట్ బాంబు పేలుడు బాధితుడిగా భావిస్తారని వెల్లడించింది. ఇలాంటి పరిస్థితి తాను తెచ్చుకోదల్చుకోలేదన్నారు. తన కోసం స్కిప్ట్ తయారు చేస్తానని తన తండ్రి మాటయిచ్చారని అలియా తెలిపింది. ఇది తనకు అవార్డు తెచ్చే సినిమా అవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.