త్వరలో మమ్మీతో కలిసి ఓ సినిమా చేస్తా | I'd like to do serious film with my mom,says Alia Bhatt | Sakshi
Sakshi News home page

త్వరలో మమ్మీతో కలిసి ఓ సినిమా చేస్తా

Published Tue, Jul 8 2014 3:10 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

త్వరలో మమ్మీతో కలిసి ఓ సినిమా చేస్తా - Sakshi

త్వరలో మమ్మీతో కలిసి ఓ సినిమా చేస్తా

ముంబై:త్వరలో తన తల్లి సోనీ రజ్ దాన్ తో కలిసి ఓ గంభీరమైన చిత్రంలోనటిస్తానని బాలీవుడ్ నటి అలియా భట్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఆ సినిమాకు నాన్న మహేష్ భట్ దర్శకత్వం వహిస్తారనే ఆశాభావం వ్యక్తం చేసింది. 2005 లో వెండితెరకు దూరమైన తన తల్లి ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించిందన్న విషయాన్ని అలియా గుర్తు చేసుకుంది.  నాకైతే దర్శకత్వం చేసే ఆలోచన లేదని అలియా తెలిపింది.

 

కాకపోతే ఇద్దరం కలిసి ఒక మంచి సినిమాలో నటిస్తామని అంటోంది. ' త్వరలో మేమిద్దరం సినిమా చేస్తాం. ఆ స్క్రిప్ట్ ను కూడా విన్నాం. అది మా ఇద్దర్నీ ఆకట్టుకుంది' అని అలియా పేర్కొంది. ప్రస్తుతం 'హంప్టీ శర్మకీ దుల్హనియా' చిత్రంలో వరుణ్ ధావన్ కు జత కట్టిన అలియా ఆ చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉంది. మరో మూడు రోజుల్లో(జూలై 11న)ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement