అర్ధసెంచరీ కొట్టిన ఆలియా | Alia Bhatt is so excited about two states moive | Sakshi
Sakshi News home page

అర్ధసెంచరీ కొట్టిన ఆలియా

Published Wed, Oct 24 2018 1:15 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Alia Bhatt is so excited about two states moive - Sakshi

గ్రౌండ్‌లో కాదు... ‘కళంక్‌’ సినిమా సెట్‌లో కథానాయిక ఆలియా భట్‌ అర్ధ సెంచరీ కొట్టారు. మీరు ఊహించినట్లు ‘కళంక్‌’ సినిమా సెట్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ ఏమీ ఆడలేదు. ఈ సినిమా షూటింగ్‌లో ఆలియా భట్‌ 50 రోజులను పూర్తి చేసుకున్నారని చెబుతున్నాం. ‘2 స్టేట్స్‌’ ఫేమ్‌ అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ హిందీ చిత్రం ‘కళంక్‌’. సంజయ్‌ దత్, మాధురి దీక్షిత్, వరుణ్‌ ధావన్, ఆలియా భట్, ఆదిత్యారాయ్‌ కపూర్‌ కీలక పాత్రలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో వేసిన సెట్‌లో జరుగుతుందని బాలీవుడ్‌ సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు ఆలియా. అలాగే ఆమె తండ్రి మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘సడక్‌ 2’లో కూడా ఓ కీలక పాత్ర  చేయనున్నారామె. ఇక ఆలియా బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement