ప్రీతి జింతా లవ్ స్టోరీ.. హేట్ స్టోరీగా మారింది | Priety Zinta, Ness Wadia's love story turns into hate story, says Mahesh Bhatt | Sakshi
Sakshi News home page

ప్రీతి జింతా లవ్ స్టోరీ.. హేట్ స్టోరీగా మారింది

Published Sat, Jun 14 2014 3:15 PM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

ప్రీతి జింతా లవ్ స్టోరీ.. హేట్ స్టోరీగా మారింది

ప్రీతి జింతా లవ్ స్టోరీ.. హేట్ స్టోరీగా మారింది

ముంబై: బాలీవుడ్ సుందరి ప్రీతి జింతా, వ్యాపార వేత్త నెస్ వాడియాల ప్రేమ బంధం ముగియడం దురదృష్టకరమని దర్శకుడు మహేష్ భట్ అన్నారు. ప్రీతి, నెస్ వాడియాల లవ్ స్టోరీ.. హేట్ స్టోరీగా మారిందని ట్వీట్ చేశారు.

 ప్రీతి జింతా తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 30న వాంఖేడ్ స్టేడియంలో  పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ప్రీతి సహ భాగస్వామి.  నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో నాలుగేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. 2009లో వీరిద్దరూ విడిపోయారు. నెస్ వాడియా కూడా ఐపీఎల్ పంజాబ్ టీంకు భాగస్వామిగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement