Ness Wadia
-
Punjab Kings: అనిల్ కుంబ్లేతో పంజాబ్ కటీఫ్! మయాంక్ విషయంలో మాత్రం..
మొహాలి: మూడు ఐపీఎల్ సీజన్లలో తమ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించినా... ఆశించిన ఫలితాలు అందించలేకపోయిన అనిల్ కుంబ్లేతో పంజాబ్ కింగ్స్ బంధం తెంచుకుంది. వచ్చే సీజన్ కోసం కుంబ్లేతో ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని ప్రకటించింది. టీమ్ యజమానులైన ప్రీతి జింటా, నెస్ వాడియా తదితరులు కలిసి సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త కోచ్‌ను ఫ్రాంచైజీ ఎంపిక చేస్తుంది. 2020లో కుంబ్లే హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా వరుసగా రెండేళ్లు టీమ్ ఐదో స్థానంలో నిలిచింది. 2022లో పది టీమ్‌ల ఐపీఎల్లో పంజాబ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జట్టులో ఎన్ని మార్పులు చేసినా, వ్యూహాలు మార్చినా పంజాబ్ కోచ్ పదవి ఎవరికీ కలిసి రాలేదు. 2014 నుంచి చూస్తే ఆ జట్టుకు కుంబ్లే ఐదో కోచ్. వరుసగా సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్జ్, మైక్ హెసన్ కోచ్‌గా పని చేసినా జట్టు రాత మారలేదు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో పంజాబ్ 42 మ్యాచ్‌లు ఆడగా... 18 గెలిచి, 22 ఓడింది.మరో 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. ఓవరాల్‌గా కూడా 2008 నుంచి ఐపీఎల్లో ఉన్నా రెండుసార్లు మాత్రమే పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లగలిగింది. 2014లో ఫైనల్ చేరడం ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత సీజన్ వేలంలో బెయిర్‌స్టో, రబడ, లివింగ్‌స్టోన్, శిఖర్ ధావన్‌లాంటి ఆటగాళ్లను ఎంచుకున్నా ఫలితం మాత్రం మారలేదు. కోచ్‌ను తప్పించిన పంజాబ్ మరోవైపు కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌ను కొనసాగించే విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. చదవండి: Asia Cup 2022: పాక్ క్రికెటర్‌పై పుజారా ప్రశంసల వర్షం -
IPL 2022: విజయవంతమైన వేలం.. సగం పని పూర్తైంది.. ఇక టైటిల్ గెలవడమే లక్ష్యం!
IPL 2022 Mega Auction- Punjab Kings: ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. పంజాబ్ కింగ్స్‌గా మారింది.. కెప్టెన్లను కూడా మార్చింది. పేరు మార్చినా.. కెప్టెన్లను మార్చినా రాతను మాత్రం మార్చుకోలేకపోయింది. కీలక మ్యాచ్‌లలో ఆఖరిదాకా పోరాడటం.. తీరా సమయానికి చేతులెత్తేయడం.. వెరసి ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదన్న లోటు అలాగే ఉండిపోయింది. అయితే, ఈసారి ఆ బెంగ తీరిపోతుందని పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ మెగా వేలం- 2022లో సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకుని సగం పని పూర్తిచేశామని పేర్కొన్నాడు. కాగా బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో భాగంగా పంజాబ్.. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను అత్యధిక ధర(రూ. 11.50 కోట్లు)కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా రబడ, శిఖర్ ధావన్‌ను వంటి స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం జట్టులో మొత్తంగా 25 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో భారత క్రికెటర్లు 18 మంది కాగా, విదేశీ ఆటగాళ్లు ఏడుగురు. వీరి కోసం ఫ్రాంఛైజీ తమ పర్సు నుంచి రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో నెస్ వాడియా జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ట్రోఫీ సాధించాలంటే సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం అవసరం. మంచి జట్టు దొరికితే సగం గెలిచినట్లే. మేము చేసింది అదే! ఇప్పుడు భారమంతా ఆటగాళ్లు, కోచ్‌లు అనిల్ కుంబ్లే, జాంటీ రోడ్స్, డెమిన్ మీదనే ఉంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టైటిల్ అందిస్తారని భావిస్తున్నాం. లేదంటే కనీసం టాప్-4లోనైనా నిలబెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత నాలుగైదేళ్లుగా మా ప్రదర్శన అస్సలు బాగాలేదు. దానిని అధిగమించాలనుకుంటున్నాం. ఇప్పుడు మా జట్టు సమతుల్యంగా ఉంది. మంచి బ్యాటర్లు, బౌలర్లను ఎంచుకున్నాం. నాకు తెలిసి 2008 తర్వాత మేము ఎదుర్కొన్న అత్యంత కఠినమైన, విజయవంతమైన ఐపీఎల్ వేలం ఇదే’’ అని నెస్ వాడియా చెప్పుకొచ్చాడు. కాగా కేఎల్ రాహుల్ జట్టును వీడటంతో పంజాబ్ ఇప్పుడు కెప్టెన్ ఎంపిక అంశంలో బిజీగా ఉంది. సీనియర్ శిఖర్ ధావన్ లేదంటే, మయాంక్ అగర్వాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టు మయాంక్ అగర్వాల్, లివింగ్‌స్టోన్, రబడ, షారుఖ్ ఖాన్, ధావన్, బెయిర్‌స్టో, ఒడియన్ స్మిత్, రాహుల్ చహర్, అర్శ్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రాజ్ బావా, వైభవ్ అరోరా, నాథన్ ఎలిస్, ప్రభ్‌సిమ్రన్, రిషి ధావన్, భనుక రాజపక్స, సందీప్ శర్మ, బెన్ని హోవెల్, ఇషాన్ పొరెల్, ప్రేరక్ మన్కడ్, జితేశ్ శర్మ, బల్తేజ్ సింగ్, రితిక్ ఛటర్జీ, అథర్వ తైడ్, అన్శ్ పటేల్. చదవండి: IPL 2022- MS Dhoni: ఆ మ్యాచ్‌లు అన్నీ మహారాష్ట్రలోనే... ధోని మాస్టర్ ప్లాన్.. ముంబైని కొట్టాలిగా మరి! -
‘అది జరగకపోతే నా పేరు మార్చుకుంటా’
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్‌పై అత్యంత ధీమాగా ఉన్నారు కింగ్స్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా. యూఏఈ వేదికగా జరిగే ఈ సీజన్ ఐపీఎల్ అత్యుత్తమ సీజన్‌గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ సీజన్ ఐపీఎల్‌ను ఎక్కువ మంది వీక్షించకపోతే తాను పేరు మార్చుకోవడానికి వెనుకాడనన్నారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివో తప్పుకోవడానికి ముందే నెస్ వాడియా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌కు స్పాన్సర్ నుంచి ఎవరైతే తప్పుకుంటారో వారు తర్వాత తప్పకుండా బాధపడతారన్నారు. (ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?) ఐపీఎల్ సక్సెస్ కాదనే ఉద్దేశంతోనే కొన్ని కంపెనీలు వెనుకంజ వేస్తున్న క్రమంలో వాడియా స్పందించారు. ‘ ఐపీఎల్ నుంచి ఏ కంపెనీ తప్పుకున్నా వారు తర్వాత బాధపడతారు. ఎందుకు ఈ సీజన్ ఐపీఎల్లో భాగం కాలేదని పశ్చాత్తాపం చెందుతారు. ఇది అత్యుత్తమ సీజన్‌గా నిలవడం ఖాయం. నేను ఒక స్పాన్సర్‌గా ఉంటే కచ్చితంగా ముందుకెళ్లేవాడిని’ అని వాడియా తెలిపారు. ఒక ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేకుండా ఐపీఎల్‌ను నిర్వహించడంపైనే బీసీసీఐతో ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయన్నాడు. ఒకవేళ ఒక్క కరోనా కేసు వచ్చినా ఐపీఎల్ కథ కంచికే వెళుతుందన్నాడు. ఇప్పుడున్న తమ ముందన్న లక్ష్యం స్పాన్సర్లు కాదని, కరోనా పాజిటివ్ కేసులు లేకుండా నిర్వహించడమేనన్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో కరోనా వైరస్ గురించి మాట్లాడకుండా స్పాన్సర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చైనా కంపెనీ వివో తప్పుకున్నా ఆ ప్లేస్‌ను భర్తీ చేయడానికి చాలా కంపెనీలు వస్తాయన్నారు. ఇక వివో ఇప్పుడు తప్పుకుంటే ఆ కంపెనీతతో బీసీసీఐ జత కట్టే పరిస్థితులు ఉండకపోవచ్చన్నారు. -
క్రికెటర్లకు రోజూ కరోనా పరీక్షలు నిర్వహించాలి
న్యూఢిల్లీ: యూఏఈలో ఐపీఎల్ సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉండాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆటగాళ్లకు ప్రతీ రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. సెప్టెంబర్ 19 నుంచి అరబ్ ఎమిరేట్స్‌లో లీగ్‌ను నిర్వహించాలని భారత బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో నెస్ వాడియా ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఐపీఎల్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని బీసీసీఐ తయారు చేయనుంది. ‘ఐపీఎల్ జరిగే సమయంలో మైదానంలోనూ, మైదానం బయట కూడా కచ్చితమైన ఆరోగ్య పరిరక్షణ నిబంధనలు పాటించాలి. ఇందులో ఏమాత్రం రాజీ పడరాదు. సాధ్యమైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు జరపాలి. సరిగ్గా చెప్పాలంటే ప్రతి రోజూ నిర్వహిస్తే మంచిది. నేనే ఆటగాడినైతే ఎలాంటి అభ్యంతరం చెప్పను. లీగ్‌లో ఎనిమిది జట్లు ఉంటాయి కాబట్టి ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్ తరహాలోనైతే బయో సెక్యూర్ వాతావరణం సాధ్యం కాదు. కోవిడ్–19 పరీక్షల విషయంలో యూఏఈ కూడా చాలా బాగా పని చేస్తోంది కాబట్టి బీసీసీఐ అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తే చాలు’ అని నెస్ వాడియా వివరించారు. టీవీలో సూపర్ హిట్టవుతుంది... కరోనా కష్టకాలంలో ఐపీఎల్‌కు స్పాన్సర్లు రాకపోవచ్చనే వాదనను నెస్ వాడియా తిరస్కరించారు. నిజానికి స్పాన్సర్లు అదనపు ప్రయోజనం పొందేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని ఆయన అన్నారు. ‘గతంలో ఏ ఐపీఎల్‌కూ లభించని వీక్షకాదరణ టీవీల్లో ఈసారి లీగ్‌కు దక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా స్పాన్సర్లు ముందుకొచ్చేందుకు ఇది సరైన తరుణం’ అని పంజాబ్ యజమాని పేర్కొన్నారు. మరోవైపు ప్రేక్షకులు లేకుండా లీగ్‌ను ఆడిస్తే తాము టికెట్ల రూపేణా కోల్పోయే నష్టాన్ని బీసీసీఐ ఏదో రూపంలో భర్తీ చేస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
‘చైనా బంధం’ తెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: మన దేశం కోసం, ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చైనా స్పాన్సర్లతో ఇకపై ఒప్పందాలు చేసుకోరాదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. ఇప్పటికిప్పుడు ఒప్పందాన్ని ఉల్లంఘించడం కష్టం కాబట్టి 2021 నుంచి వాటిని పక్కన పెట్టాలని అతను సూచించాడు. స్వదేశీ కంపెనీలు ఒక్కసారిగా ముందుకు రావడం కష్టమే అయినా... మెల్లమెల్లగా చైనా సంస్థలను పక్కన పెట్టాలని అతను చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్‌కు చైనా మొబైల్ కంపెనీ ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ‘ఇది ఇండియన్ ప్రీమియర్ లీగే తప్ప చైనా ప్రీమియర్ లీగ్ కాదు. ఎప్పుడైనా మన దేశమే ముందు. ఆ తర్వాత డబ్బు. నా ఉద్దేశం ప్రకారం చైనా కంపెనీలతో బంధం తెంచుకోవాల్సిందే. వారిని పక్కన పెడితే ఆ స్థానంలో స్పాన్సర్షిప్ అందించేందుకు పలు భారత కంపెనీలు ముందుకు వస్తాయని నా నమ్మకం. మన కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులను గౌరవించేందుకు ఇదో అవకాశం. కనీసం వచ్చే ఏడాది నుంచైనా చైనా సంస్థల స్పాన్సర్షిప్ తీసుకోవద్దు. ఇలాంటి సమయంలో దేశం తరఫున నిలవడం మన నైతిక బాధ్యత’ అని నెస్ వాడియా వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లోని ఇతర ఫ్రాంచైజీలు కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆలోచిస్తామని, అప్పటి వరకు ఇలాంటి విషయంలో వేచి చూడటమే సరైన పద్ధతి అని వారు అభిప్రాయపడ్డారు. -
ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఉండాల్సిందే: నెస్ వాడియా
న్యూఢిల్లీ: విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్ నిర్వహించడంలో అర్థమే లేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో బీసీసీఐ... లీగ్ నిర్వహణపై ఓ నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందన్నాడు. ‘ప్రపంచంలో ఐపీఎల్ ఉన్నతమైన క్రికెట్ ఈవెంట్. దీనికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఇందులో కచ్చితంగా అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఆడాలి. కానీ ప్రయాణ ఆంక్షల కారణంగా టోర్నీ జరిగే నాటికి ఎంతమంది విదేశీ ఆటగాళ్లు భారత్‌కు రాగలరనేది చూడాలి. ఇందులో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి టోర్నీ ఎప్పుడు జరుగుతుందో చెప్పడం బీసీసీఐకి కూడా కష్టమే’ అని వాడియా పేర్కొన్నాడు. కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై ఫ్రాంచైజీలన్నీ భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నాయి. ఈ ఏడాది కేవలం భారత ఆటగాళ్లతో లీగ్‌ను నిర్వహించాలని రాజస్తాన్ రాయల్స్ పేర్కొనగా... చెన్నై సూపర్ కింగ్స్ ఈ ప్రతిపాదనను ఖండించింది. -
రాజస్తాన్ రాయల్స్ ప్రపోజల్‌కు కింగ్స్ నో!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణపై ఏమి చేద్దామనే విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తలలు పట్టుకుంటుంటే ఫ్రాంచైజీలు మరింత ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ఏకాభిప్రాయ లేకపోవడంతో ఐపీఎల్ నిర్వహణ ఎక్కడకు దారి తీస్తుందో బీసీసీఐ పెద్దలకు అంతు చిక్కడం లేదు. తాజాగా కింగ్స్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసేలా కనిపిస్తున్నాయి. విదేశీ క్రికెటర్లు లేకుండా ఐపీఎల్‌ను నిర్వహించడం సాధ్యం కాదని కుండ బద్ధలు కొట్టాడు. ఒకవైపు భారత ఆటగాళ్ల ద్వారానే ఐపీఎల్‌ను నిర్వహిద్దామనే ప్రపోజల్‌ను రాజస్తాన్ రాయల్స్ తీసుకురాగా, మరొకవైపు ఆ ప్రతిపాదనకు నెస్ వాడియా విముఖత వ్యక్తం చేశారు. (స్టోక్స్ కోసం ఏమైనా రూల్స్ మార్చారా?) ‘ఐపీఎల్ అనేది భారత్‌లో రూపాంతరం చెందిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్. వరల్డ్‌లోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్. దానికి ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్ కావాలి.. అంటే ఇంటర్నేషనల్ ఆటగాళ్లు ఉండాల్సిందే. కేవలం భారత క్రికెటర్లను మాత్రమే అనుమతిస్తూ ఐపీఎల్ నిర్వహిద్దామనే యోచిస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కూడా షెడ్యూల్‌ను ఫిక్స్ చేయడానికి తొందర పడుతున్నట్లే కనబడుతుంది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ నిర్వహణపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దు. రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. కరోనా పాజిటివ్ కేసులు పెరగవనే గ్యారంటీ ఏమీ లేదు. ఒకవైపు కోవిడ్-19 వ్యాప్తి ఇంకా అలానే ఉండగా ఒక టోర్నీ నిర్వహణపై అప్పుడే తుది నిర్ణయానికి రాకండి. చాలామంది నిపుణులు జూలై-ఆగస్టు నెలల్లో కరోనా మరింత విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఒక నెల నుంచి రెండు నెలల సమయం తీసుకుంటేనే మంచిది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాతే ఐపీఎల్‌పై క్లారిటీకి రావడం ఉత్తమం. టోర్నీని ఎక్కడ నిర్వహించాలి.. ఎలా నిర్వహించాలి అనే దానిపై స్పష్టత రావాలంటే నిరీక్షణ తప్పదు’ అని నెస్ వాడియా తెలిపారు.(అందుకే స్మిత్‌ను గేలి చేశా: ఇషాంత్) -
వాడియాపై చర్చించనున్న సీఓఏ
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియాపై శుక్రవారం ముంబైలో జరుగనున్న సమావేశంలో క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) చర్చించనుంది. వాడియా... ఇటీవల జపాన్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. దీంతో అక్కడి కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత ఈ శిక్షను ఐదేళ్ల పాటు సస్పెండ్ చేశారు. ఐపీఎల్ నైతిక నియమావళి ప్రకారం... ఫ్రాంచైజీలతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి కూడా ఆటకు అపకీర్తి తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. గతంలో రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీల సంబంధీకులు స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో అభియోగాలు ఎదుర్కొన్నందుకు చర్యలకు గురయ్యారు. మరోవైపు వాడియా వ్యవహారం ఇప్పటివరకు ఐపీఎల్ నైతిక విలువల కమిటీ ముందుకు రాలేదు. శుక్రవారం సమావేశంలో దీనిని చర్చించి ముగ్గురు సభ్యుల ఆఫీస్ బేరర్ల బృందానికి కానీ, సుప్రీం కోర్టు నియమిత అంబుడ్స్‌మన్–ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్‌కు కానీ నివేదించనున్నట్లు తెలుస్తోంది. బహుశా, అంబుడ్స్‌మన్‌కే ఈ బాధ్యత అప్పగిస్తారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘పంజాబ్‌పై నిషేధం’ ఊహాగానమేనని పేర్కొన్న ఆయన... ఘటనతో ఐపీఎల్‌కు నేరుగా సంబంధం లేదనే విషయాన్ని ప్రస్తావించారు. లీగ్‌కు ఇబ్బంది అని భావిస్తేనే చర్యలుంటాయని వివరించారు. బీసీసీఐ న్యాయ బృందం, అంబుడ్స్‌మన్ దీనిపై చర్చిస్తుందని స్పష్టం చేశారు. -
పంజాబ్ కింగ్స్ ఓనర్‌కు రెండేళ్ల జైలు
టోక్యో : ఐపీఎల్ టీం పంజాబ్ కింగ్స్ యజమాని, పారిశ్రామికవేత్త నెస్ వాదియాకు జపాన్‌లో డ్రగ్స్‌తో పట్టుబడిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది మార్చిలో 25 గ్రాముల మత్తుపదార్ధాలను కలిగిఉన్న కేసులో నెస్వాదియాకు శిక్ష ఖరారైందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. కాగా, నెస్ వాదియా వాదియా గ్రూప్ అధినేత నుస్లీ వాదియా వారసుడు కావడం గమనార్హం. తాను కేవలం వ్యక్తిగత వాడకం కోసమే మత్తుపదార్ధాలను తన వద్ద ఉంచుకున్నానని మార్చిలో అరెస్ట్ అయిన సందర్భంలో నెస్ వాదియా అంగీకరించారు. కాగా నెస్ వాదియాకు జైలు శిక్షపై వాదియా గ్రూప్ ఇప్పటివరకూ స్పందించలేదు. -
#మీటూ : ‘అప్పుడు రాఖీ సావంత్.. ఇప్పుడు మీరు’
మీ నుంచి ఇలాంటి సమాధానాలు ఊహించలేదంటూ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హంగామా యూట్యూబ్ చానల్లో ప్రసారమైన ప్రీతి ఇంటర్వ్యూనే ఇందుకు కారణం. ఇంతకీ విషయమేమిటంటే... నవంబరు 16న రికార్డు చేసిన ఇంటర్వ్యూలో భాగంగా ప్రీతి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం భారతదేశాన్ని కుదిపేస్తున్న మీటూ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. మీకు అలాంటి అనుభవం ఎదురైందా అని ఆమెను ప్రశ్నించగా.. ‘లేదు.. ఒకవేళ ఉన్నా బాగుండేది. మీ ప్రశ్నకు జవాబు దొరికి ఉండేది’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతేకాకుండా ‘మనం ఎలా ఉండాలని కోరుకుంటామో.. ఎదుటి వ్యక్తి మనల్ని చూసే విధానం కూడా అలాగే ఉంటుంది. నాకైతే ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురవలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ మహిళలకు చాలా శ్రేయస్కరమైనది. కొంతమంది పబ్లిసిటీ కోసం ఏమైనా మాట్లాడేస్తున్నారు ’ అని ప్రీతి చెప్పుకొచ్చారు. దీంతో మరి నెస్వాడియా సంగతేంటి. అప్పుడు మీరు ఎందుకు అతడిపై కేసు పెట్టారు.. ఒక మహిళ అయి ఉండి మహిళల గురించి అలా ఎలా మాట్లాడతారు.. మొదట రాఖీ సావంత్.. ఇప్పుడు మీరు.. అసలు ఊహించలేదు ’ అంటూ ప్రీతిని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తుండటంతో ప్రీతి దిద్దుబాటు చర్యలకు దిగారు. తన ఇంటర్వ్యూను ఎడిట్ చేసి, వాళ్లకు కావాల్సిన విధంగా మలచుకున్నారంటూ తనను ప్రశ్నించిన జర్నలిస్టుపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. అయితే ప్రీతి ఆరోపణలపై సదరు జర్నలిస్టు ఇంతవరకు స్పందించలేదు. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా 2014లో ఓ మ్యాచ్ సందర్భంగా వ్యాపారవేత్త నెస్వాడియా తనతో అనుచితంగా ప్రవర్తిచాడంటూ ఫిర్యాదు చేశారు. అయితే ప్రీతి ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల తర్వాత అంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై పోలీసులు నెస్‌పై చార్జిషీట్ దాఖలు చేశారు. గత నెలలో నెస్ వాడియాపై వేధింపుల కేసు కొట్టి వేస్తున్నట్లు బాంబే హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. I’m really suprised & upset that journalists like @iFaridoon take an interview & edit it to sound controversial for better traction. If I said “I wish someone had bothered me” - it meant I would have probable beaten them up if they had... Interviews taken out of context #Metoo — Preity G Zinta (@realpreityzinta) November 19, 2018 -
వేధింపుల కేసులో నెస్ వాడియాకు ఊరట
ముంబై : బాలీవుడ్ నటి ప్రీతి జింటాను వేధించిన కేసులో పారిశ్రామిక వేత్త నెస్ వాడియాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నెస్ వాడియాపై వేధింపుల కేసు కొట్టి వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కాగా నెస్వాడియా క్షమాపణలు చెబితే ప్రీతి కేసు వాపసు తీసుకుంటారని ఆమె తరపు లాయరు పేర్కొనడంతో.. నెస్ వాడియా లాయరు మొదట అందుకు ఒప్పుకోలేదు. కానీ బుధవారం ఇరు వర్గాలు కోర్టుకు హాజరుకాగా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో నెస్ వాడియా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధపడటంతో కేసును కొట్టి వేస్తున్నట్లు జస్టిస్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా 2014లో ఓ మ్యాచ్ సందర్భంగా నెస్వాడియా తనతో అనుచితంగా ప్రవర్తిచాడంటూ ఫిర్యాదు చేశారు. అయితే ప్రీతి ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల తర్వాత అంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై పోలీసులు నెస్‌పై చార్జిషీట్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 354, 506, 509ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. -
మాజీ ప్రేమికులు విభేదాలను పక్కనబెట్టి..
ముంబై: మాజీ ప్రేమికులు బాలీవుడ్ భామ ప్రీతి జింటా, వ్యాపారవేత్త నెస్ వాడియాలు గతంలో ఏర్పడ్డ విభేదాలను పక్కనపెట్టారు. ప్రేమ, వివాదాలను మరచిపోయి ఐపీఎల్ జట్టు కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు భాగస్వాములుగా కలసి పనిచేయనున్నారు. గతంలో పరస్పరం తీవ్ర ఆరోపణలు, దూషణలు చేసుకుని కేసుల వరకు వెళ్లిన ప్రీతి, వాడియా.. తాజా ఐపీఎల్ సీజన్లో ముచ్చటించుకుంటూ కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన సందర్భంగా ఇద్దరూ తమ జట్టు క్రికెటర్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రీతి, వాడియా గతంలో దాదాపు 10 ఏళ్లు డేటింగ్ చేశారు. వ్యాపార భాగస్వాములుగా మారి 2008లో ఐపీఎల్ జట్టు పంజాబ్ సహ యజమానులయ్యారు. కాగా ఆ మరుసటి ఏడాది నుంచి ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఓ పార్టీలో ప్రీతిని వాడియా చెంపదెబ్బ కొట్టినట్టు వార్తలు వచ్చాయి. ఇక 2014లో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. వాడియా తనను దూషించి, లైంగికంగా వేధించాడని ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆయన ఈ ఆరోపణలను ఖండించారు. ఆ తర్వాత ఇద్దరూ పూర్తిగా దూరమయ్యారు. గతేడాది ప్రీతి వ్యాపారవేత్త గుడెనఫ్‌ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రీతి, వాడియా గతాన్ని మరిచి వ్యాపార భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. -
మ్యాచ్‌ల తరలింపుకు నెస్ వాడియా మద్దతు
న్యూఢిల్లీ:నీటి కరువు కారణంగా మహారాష్ట్రలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌లను తరలించాలన్న ఆలోచనను కింగ్స్ పంజాబ్ యజమాని నెస్ వాడియా సమర్ధించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్ ల తరలింపును మానవతా కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు నీటి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇక్కడ మ్యాచ్‌లను నిర్వహించడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. మహారాష్ట్రలో నీటి ఎద్దడిని చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి ఉందన్నారు. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ముంబై, పుణె, నాగ్పూర్ల్లో 19 మ్యాచ్‌లు జరగాల్సివుంది. రాష్ట్రంలో గత వంద ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరువు తాండవిస్తున్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లను రాష్ట్రంలో నిర్వహించవద్దని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ల సందర్భంగా మైదానాల నిర్వహణకు ఎంతలేదన్న సుమారు 60 లక్షల లీటర్ల నీటిని వినియోగించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో ఇక్కడ మ్యాచ్ ల నిర్వహణ సబబు కాదని ఒక ఎన్జీవో సంస్థ బాంబే కోర్టులో పిల్ దాఖలు చేసింది. అయితే ఏప్రిల్ 9 వ తేదీన వాంఖేడే స్టేడియంలో జరిగిన ఆరంభపు మ్యాచ్‌కు కోర్టు అనుమితినిచ్చినా.. మిగతా మ్యాచ్‌లపై మాత్రం సందిగ్ధత నెలకొంది. -
మీడియాపై ప్రీతీ జింటా రుసరుస..
మాజీ బాయ్‌ఫ్రెండ్ నెస్ వాడియాపై పెట్టిన కేసు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ప్రీతీ జింటా రుసరుసలాడింది. ‘ఆ విషయాన్ని పోలీసులనే అడగండి’ అంటూ దూకుడుగా బదులిచ్చింది. నెస్ వాడియా తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడంటూ ప్రీతీజింటా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబై ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను కొందరు మీడియా ప్రతినిధులు ఆ కేసు విషయమై ప్రశ్నించడంతో సహనం కోల్పోయింది. అంతా తనను సెలిబ్రిటీగా పిలుస్తున్నా, తానూ మామూలు మనిషినేనని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు గురించి ఏమీ మాట్లాడబోనని చెప్పింది. -
'ప్రీతిజింటా ఎలాంటి షరతులు విధించలేదు'
ముంబై: బాలీవుడ్ తార ప్రీతి జింటా ఐదు షరతులు పెట్టినట్టు మీడియాలో వస్తున్న వార్తలను వాడియా గ్రూప్ ఖండించింది. జూన్ లో పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవడానికి ఐదు షరతులు పెట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. మే 30 తేదిన వాంఖెడే స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తనను లైంగికంగా వేధించారని ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ లో ప్రీతి జింటా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 'మీడియాలో వస్తున్న వార్తలన్ని ఊహాజనితమైనవి. వాటిలో వాస్తవం లేదు. ఇరువర్గాల మధ్య అలాంటి చర్చలు జరగలేదు' అని వాడియా గ్రూప్ వెల్లడించింది. అయితే ఆరోజున నెస్ వాడియా, ప్రీతిజింటాల మధ్య ఎలాంటి వివాద ఛాయలు కనిపించలేదని ఈకేసులో నలుగురు సాక్ష్యులు చెప్పినట్టు తెలుస్తోంది. -
ముఖంపై కాలుతున్న సిగరెట్లు విసిరేవాడు
వాడియాపై ప్రీతి జింటా సంచలన ఆరోపణలు ముంబై: మాజీ ప్రియుడు, పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల చేసిన వేధింపుల ఆరోపణల్లో సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మే 30న ముంబై స్టేడియంలో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు ప్రీతి జింటా జూన్ 12న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందే వాడియా తనను ఎన్నోసార్లు వేధింపులకు గురిచేసినట్లు ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాకు జూన్ 30న (విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ) అందించిన లేఖలో ప్రీతి పేర్కొన్నారు. తన ముఖంపై వాడియా కాలుతున్న సిగరెట్లను విసరడం, గదిలోపెట్టి తాళం వేయడం వంటి దురాగతాలకు పాల్పడిన వైనాన్ని లేఖలో ప్రీతి ప్రస్తావించారు. తాను శాంతియుతంగా జీవించేందుకు వాడియాను తన నుంచి దూరంగా ఉంచాలని ప్రీతి పోలీసులను వేడుకున్నారు. లేకపోతే ఏదో ఒక రోజు వాడియా తనను చంపుతాడేమోనని భయపడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాడియాకు హాని చేయాలన్న ఉద్దేశం తనకు లేనప్పటికీ తన భద్రత దృష్ట్యా గత్యంతరం లేకే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని లేఖలో చెప్పుకొచ్చారు. ప్రీతి జింటా ఆరోపణలను వాడియా గతంలోనే తోసిపుచ్చగా తాజాగా వెలుగు చూసిన ఆరోపణలపై స్పందించేందుకు వాడియా గ్రూపు ప్రతినిధులెవరూ అందుబాటులోకి రాలేదు. ప్రీతి జింటా, నెస్ వాడియాలు ఐపీఎల్ క్రికెట్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సహ యజమానులుగా ఉన్న విషయం తెలిసిందే. -
నెస్ నన్ను సిగరెట్లతో కాల్చాడు: ప్రీతిజింటా
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతిజింటా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియాపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. నెస్ వాడియా గతంలో తనను సిగరెట్లతో కాల్చాడని ప్రీతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెస్ వాడియా తనను గదిలో ఉంచి బంధించేవాడని ముంబై పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖలో ప్రీతి పేర్కొంది. కొన్నిసార్లు అతను భయంకరంగా ప్రవర్తించేవాడని తెలిపింది. తనను చంపేస్తాడేమోనని ఆందోళన చెందానని పేర్కింది. అతని ఆగడాలను భరించలేక ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అతనికి దూరమయ్యానని ప్రీతిజింటా చెప్పింది. ఐపీఎల్ సందర్భంగా నెస్ తనను దూషించి చేయి చేసుకున్నాడని ప్రీతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఐదేళ్ల పాటు కలసిమెలసి తిరిగిన ఈ జంట ఆనక విడిపోయింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్‌లో ప్రీతి, నెస్ ఇద్దరూ సహ భాగస్వాములు. -
మహిళను కావడమే నేను చేసిన తప్పు: ప్రీతి జింటా
ఒకప్పటి తన వ్యాపార భాగస్వామి నెస్ వాడియాపై పోలీసుకేసు పెట్టడం అపరిపక్వత కాదని, తాను చేసిన తప్పల్లా.. మహిళను కావడమేనని సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా చెప్పింది. తరచుగా తనను తిట్టడం, బెదిరించడం, అవమానించడం లాంటివి అయిన తర్వాతే తాము విడిపోయే దశకు వచ్చామని తెలిపింది. నెస్ వాడియా తనను లైంగికంగా వేధించాడంటూ ప్రీతి ఇటీవలే ఓ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. జనం కాస్తంత ఓపిక పడితే వాస్తవాలు బయటకు వస్తాయని ఆమె తెలిపింది. తాను గతంలో ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని, అది తనకు నప్పని విషయమని ప్రీతి అంది. తాను బాధ్యతాయుతమైన పౌరురాలినని, కేవలం మహిళను అయినందుకే తనను ఇన్నాళ్లుగా వేధించాడని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. మహిళలను హింసించడం సరికాదని, ఇంత జరుగుతున్నా జనం మాత్రం మహిళలనే తప్పుబడుతున్నారని వాపోయింది. తాను తనకోసమే పోరాటం చేస్తున్నానని, ఇది ఏ ఒక్క కుటుంబంపై పోరాటం కాదని, కేవలం ఒక్క వ్యక్తిమీద చేస్తున్నదేనని ప్రీతి జింటా చెప్పింది. తానేమీ ప్రెస్మీట్లు పెట్టి ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని, పైపెచ్చు.. తన వ్యక్తిగత రహస్యాలను గౌరవించాలని కూడా కోరానని తెలిపింది. -
ముంబై పోలీసు కమిషనర్ ను కలిసిన ప్రీతి
ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసు పెట్టిన బాలీవుడ్ నటి ప్రీతిజింటా సోమవారం ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాను కలిశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. కమిషనర్ వెంటనే ఆమెకు అనుమతియిచ్చారు. ఈ సందర్భంగా వేధింపుల కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు కమిషనర్ కు తెలిపారు. ఈ కేసులో ముంబై వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు ఇటీవల వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. మే 30న ఈ స్టేడియంలో ఐపీఎల్ టోర్నమెంట్లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతిజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. -
ప్రీతి జింటా పోలీసులకు అంతా చెప్పేసింది!
ముంబై: తనకు, మాజీ బాయ్ ఫ్రెండ్, వ్యాపార భాగస్వామి నస్ వాడియాకు తనకు మధ్య జరిగిన ఎపిసోడ్ ను బాలీవుడ్ నటి ప్రీతి జింటా పోలీసులకు వివరించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రెండుగంటలకు పైగా సాగిన విచారణలో అన్ని వివరాలు ప్రీతి వెల్లడించిందని పోలీసు అధికారులు తెలిపారు. జూన్ 12 తేదిన నెస్ వాడియాపై దాఖలు చేసిన ఆరోపణలపై పోలీసులు స్టేట్ మెంట్ ను మంగళవారం రికార్డు చేశారు. తనను దూషించిన విధానాన్ని, తనపై ఎలా అరిచాడో, తనను నిందించిన వైనాన్ని, దాడి చేసిన తీరును పోలీసులకు వివరంగా ప్రీతి జింటా తెలిపినట్టు అధికారులు తెలిపారు. ఆ రోజు జరిగిన ఘటనలో తనను పదే పదే హెచ్చరించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్టు ప్రీతి చెప్పిన స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. 'స్పాట్ పంచనామా'లో భాగంగా వాంఖెడే స్టేడియంలో మే 30 తేదిన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా నెస్ వాడియాతో కలిసి కూర్చున్న ప్రదేశాన్ని ప్రీతిజింటా పోలీసులకు చూపించారు. వాంఖెడే స్టేడియానికి తన సోదరుడితో కలిసి పోలీసులకు వివరాల్ని అందించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రీతి జింటా ఫిర్యాదులో పేర్కొన్న మరో 14 మందిని పోలీసులు ప్రశ్నించనున్నారు. Follow @sakshinews -
ప్రీతి వాంగ్మూలం నమోదు
ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసులో బాలీవుడ్ నటి ప్రీతిజింటా మంగళవారం సాయంత్రం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు వాంగ్మూలం ఇచ్చారు. స్టేడియం ఆవరణలోని బీసీసీఐ కార్యాలయంలో రాత్రి 8:20 గంటల వరకూ ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అనంతరం 20 నిమిషాలపాటు నాటి ఘటన పరిణామక్రమాన్ని అంచనా వేయడంలో సాయపడ్డారు. మే 30న ఈ స్టేడియంలో ఐపీఎల్ టోర్నమెంట్లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతిజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. వాడియాపై ఫిర్యాదు చేసిన అనంతరం ప్రీతి అమెరికా వెళ్లిపోవడంతో ఈ సంఘటన కచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగింది? ఆ సమయంలో చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలపై వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు స్వదేశం తిరిగి రావాల్సిందిగా పోలీసులు ప్రీతిని కోరారు. దీంతో ఆదివారం ముంబై చేరుకున్న ప్రీతి మంగళవారం సాయంత్రం స్టేడియానికి వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. -
పోలీసులకు ప్రీతిజింటా వాంగ్మూలం
ముంబై: తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసులో బాలీవుడ్ నటి ప్రీతీజింటా మంగళవారం సాయంత్రం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు వాంగ్మూలం ఇచ్చారు. స్టేడియం ఆవరణలోని బీసీసీఐ కార్యాలయంలో రాత్రి 8:20 గంటల వరకూ ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అనంతరం 20 నిమిషాలపాటు నాటి ఘటన పరిణామక్రమాన్ని పోలీసులు అంచనా వేయడంలో సాయపడ్డారు. మే 30న ఈ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతీజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. వాడియాపై ఫిర్యాదు చేసిన అనంతరం ప్రీతి అమెరికా వెళ్లిపోవడంతో ఈ సంఘటన కచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగింది? ఆ సమయంలో చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలపై మరోసారి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు స్వదేశం తిరిగి రావాల్సిందిగా పోలీసులు ప్రీతిని కోరారు. దీంతో ఆదివారం ముంబై చేరుకున్న ప్రీతి మంగళవారం సాయంత్రం స్టేడియానికి వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. -
నటి ప్రీతిజింటాపై దర్యాప్తు వేగవంతం!
ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియాపై బాలీవుడ్ నటి ప్రీతిజింటా పెట్టిన వేధింపుల కేసులో దర్యాప్తు వేగవంతం కానుంది. ముంబై పోలీసులు సోమ లేదా మంగళవారాల్లో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఈ నెల 12న వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ప్రీతిజింటా అమెరికాకు వెళ్లింది. ఆ పర్యటన ముగించుకుని ఆదివారం ఆమె ముంబైకి తిరిగొచ్చింది. దీంతో ఈ కేసులో ప్రీతిజింటా అనుబంధ వాంగ్మూలాన్ని సోమ లేదా మంగళవారాల్లో నమోదు చేయనున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. మే 30న వాంఖడే స్టేడియంలో కింగ్స్-11 పంజాబ్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతిజింటా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఈ సంఘటన కచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగింది? ఆ సమయంలో చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలను ఆమె నుంచి తెలుసుకోవాలని అనకుంటున్నట్లు ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ రవీంద్ర షిశ్వే తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా మ్యాచ్ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఆమె నుంచి మరిన్ని వివరాలు రాబట్టిన అనంతరం నెస్వాడియాను ప్రశ్నించనున్నట్లు షిశ్వే చెప్పారు. ఈ కేసులో ఐపీఎల్ సీవోవో సుందర్‌రామన్, బీసీసీఐ సెక్రటరీ సంజయ్‌పటేల్ సహా ఏడుగురు సాక్ష్యుల వాంగ్మూలాలను పోలీసులు ఇప్పటికే నమోదు చేశారు. మరోవైపు నెస్వాడియా తండ్రి నుస్లి వాడియా కార్యదర్శికి వచ్చిన బెదిరింపు కాల్స్‌పై కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. -
మీడియాపై ప్రీతి జింటా సెటైర్!
ముంబై: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో తన వాటాను అమ్మడం లేదని బాలీవుడ్ తార ప్రీతిజింటా స్పష్టం చేశారు. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీలో సహ భాగస్వామి నెస్ వాడియాపై ప్రీతి జింటా లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను యూఎస్ స్థిరపడనున్నట్టు మీడియాలో వస్తున్న రూమర్లను ప్రీతిజింటా తోసిపుచ్చారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ప్రీతి జింటా ఆసంతృప్తిని వ్యక్తం చేసింది. నేను నా వాటాను అమ్మడం లేదు. అమెరికాలో స్థిరపడటం లేదు అని ప్రీతిజింటా ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. తన జీవితం గురించి మీడియా ఊహజనిత కథనాలను రచించడం నచ్చడం లేదని ఆమె అన్నారు. వాస్తవాలకు దూరంగా ఉండే కథనాలతో వార్తలు అందించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో విషయాలకంటే.. భారతదేశంలో ఎన్నో అతిముఖ్యమైన అంశాలను రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది అని మీడియాపై ఎద్దేవా చేశారు. లైంగికంగా వేధించారని తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై ప్రీతిజింటా జూన్ 12 తేదిన ఫిర్యాదు చేశారు. -
ప్రీతీ జింటా వెంట పడొద్దు!
మాఫియా డాన్ బెదిరించినట్లు వాడియా గ్రూప్ ఫిర్యాదు ముంబై: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, ఆమె మాజీ ప్రియుడు నెస్వాడియా మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఓ మాఫియా డాన్ నుంచి తమకు బెదిరింపు కాల్‌తో పాటు మెసేజ్ వచ్చిందంటూ వాడియా గ్రూప్ సంస్థ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రీతిని వేధింపులకు గురిచేస్తే తమ వ్యాపారం సజావుగా సాగదంటూ అజ్ఞాతంలో ఉన్న మాఫియా నేత రవి పూజారీ పేరుతో ఈ నెల 16న తమకు బెదింపు కాల్స్ వచ్చాయని నెస్వాడియా తండ్రి నుస్లీ వాడియాకు వ్యక్తిగత కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ముంబై పోలీసులకు తెలిపారు.