నటి, మహిళా వ్యాపారవేత్త ప్రీతి జింతాది మొదటి నుంచీ నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం ప్రదర్శించే మనస్తత్వమే. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మాజీ ప్రియుడు, వ్యాపార భాగస్వామి నెస్ వాడియాపై ప్రీతి చేసిన ఫిర్యా దు గత రెండ్రోజులుగా బాలీవుడ్ జనాలతోపాటు వ్యాపార వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. వ్యాపారం సంబంధాలు దెబ్బతినడంతోనే ప్రీతి ఆయనపై ఇటువంటి ఆరోపణలతో ఫిర్యాదు చేసిందా? ఇంకా మరేవైనా కారణాలున్నాయా? అనే విషయాలు పక్కనబెడితే ప్రతి జింతాది ముందు నుంచీ ధైర్యంగా అడుగులు వేసే మనస్తత్వమేనని చెబుతున్నారు ఆమె సన్నిహితులు.
అందుకు పలు ఉదాహరణలు కూడా చూపుతున్నారు. బాలీవుడ్‌లో ఆమె తెరంగేట్రమే వివాదాస్పద చిత్రంతో ప్రారంభమైంది. కుందన్ షా దర్శకత్వం వహించిన ‘క్యా కహెనా’ చిత్రంలో పెళ్లి కాకుండానే తల్లి అయిన పాత్రలో ప్రీతి కనిపిస్తుంది. ఇలాంటి పాత్ర ద్వారా తెరంగేట్రం చేయాలని ప్రీతి నిర్ణయం తీసుకున్నప్పు డు వద్దని చాలా మంది వారించారట. అయినా ఆమె ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఆ చిత్రం వాయిదా పడడం, మణి రత్నం సినిమా ‘దిల్ సే’తో బాలీవుడ్ జనాలకు ఆమె పరిచయం కావడం జరిగిపోయాయి.
సిని మాలో తనతోపాటు కలిసి నటించిన షారుఖ్‌ను కూడా నిలదీసి అప్పట్లో వార్తల్లోకెక్కింది. ఇక 2001లో వేశ్యగా నటించింది. ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’ పేరుతో అబ్బాస్-ముస్తాన్‌లు తెరకెక్కించిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్ బిడ్డకు సరోగసి తల్లిగా, వేశ్యగా కనిపించినప్పుడు కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకుంటుందనే విమర్శలు వినిపించాయి. అయినా ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. 2005లో ముంబైలోని ఓ వార్తా పత్రికపై పరువునష్టం దావా వేసి మీడియాకు వ్యతిరేకంగా పోరాటాం చేసినంత పనిచేసింది. బాలీ వుడ్ తారలను అండర్‌వరల్డ్ ప్రభావితం చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసాన్ని కూడా ప్రీతి చేసింది. సుచిత్రా కృష్టమూర్తి తనపై ఆరోపణలు చేసినప్పుడు కూడా ధైర్యంగానే సమాధానమిచ్చి మళ్లీ వార్తల్లోకెక్కింది.
ఆది నుంచీ ఆడపులే..!
Published Tue, Jun 17 2014 12:18 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement