ముంబై : బాలీవుడ్ నటి ప్రీతి జింటాను వేధించిన కేసులో పారిశ్రామిక వేత్త నెస్ వాడియాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నెస్ వాడియాపై వేధింపుల కేసు కొట్టి వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కాగా నెస్‌వాడియా క్షమాపణలు చెబితే ప్రీతి కేసు వాపసు తీసుకుంటారని ఆమె తరపు లాయరు పేర్కొనడంతో.. నెస్ వాడియా లాయరు మొదట అందుకు ఒప్పుకోలేదు. కానీ బుధవారం ఇరు వర్గాలు కోర్టుకు హాజరుకాగా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో నెస్ వాడియా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధపడటంతో కేసును కొట్టి వేస్తున్నట్లు జస్టిస్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు.
కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా 2014లో ఓ మ్యాచ్ సందర్భంగా నెస్‌వాడియా తనతో అనుచితంగా ప్రవర్తిచాడంటూ ఫిర్యాదు చేశారు. అయితే ప్రీతి ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల తర్వాత అంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై పోలీసులు నెస్‌పై చార్జిషీట్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 354, 506, 509ల కింద అతడిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment