మ్యాచ్ల తరలింపుకు నెస్ వాడియా మద్దతు | KXIP owner Wadia open to shifting IPL ties out of Maharashtra | Sakshi
Sakshi News home page

మ్యాచ్ల తరలింపుకు నెస్ వాడియా మద్దతు

Published Mon, Apr 11 2016 9:11 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

మ్యాచ్ల తరలింపుకు నెస్ వాడియా మద్దతు - Sakshi

మ్యాచ్ల తరలింపుకు నెస్ వాడియా మద్దతు

న్యూఢిల్లీ:నీటి కరువు కారణంగా మహారాష్ట్రలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్లను తరలించాలన్న ఆలోచనను కింగ్స్ పంజాబ్ యజమాని నెస్ వాడియా సమర్ధించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్ ల తరలింపును మానవతా కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు నీటి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇక్కడ మ్యాచ్లను నిర్వహించడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. మహారాష్ట్రలో నీటి ఎద్దడిని చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి ఉందన్నారు.

ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ముంబై, పుణె, నాగ్పూర్ల్లో 19 మ్యాచ్‌లు జరగాల్సివుంది. రాష్ట్రంలో గత వంద ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరువు తాండవిస్తున్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్లను రాష్ట్రంలో నిర్వహించవద్దని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ల సందర్భంగా మైదానాల నిర్వహణకు ఎంతలేదన్న సుమారు 60 లక్షల లీటర్ల నీటిని వినియోగించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో ఇక్కడ మ్యాచ్ ల నిర్వహణ సబబు కాదని ఒక ఎన్జీవో సంస్థ బాంబే కోర్టులో పిల్ దాఖలు చేసింది. అయితే ఏప్రిల్ 9 వ తేదీన వాంఖేడే స్టేడియంలో జరిగిన ఆరంభపు మ్యాచ్కు కోర్టు అనుమితినిచ్చినా.. మిగతా మ్యాచ్లపై మాత్రం సందిగ్ధత నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement