జనరంజక క్రీడకు గ్రహణం
జాతిహితం
మహారాష్ట్రలోని పెద్ద నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికీ, ఆ రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? సమాధానం ఐపీఎల్‌కు ఉన్న రెండు నిర్వచనాల్లో మీరు దేన్ని మెచ్చుతారనేదాన్ని బట్టి ఉంటుంది. అది తమాషానా? లేక క్రీడా? ఈ ప్రశ్నను ఇంకాస్త పొడిగించి... ఐపీఎల్ క్షీణ ఉన్నతవర్గాల క్రీడా, లేక ఆరోగ్యకరమైన జనరంజక వినోదమా? లేదా సంప న్నుల కోసం, సంపన్నులతో, సంపన్నులే ఆడే క్రీడా? లేక సంపన్నులు యజమానులుగా/నిధులు సమకూ ర్చగా, క్రీడ కోసం, ఆ ఆట ఆడే క్రీడాకారుల కోసం, డబ్బులు చెల్లించే ప్రజల కోసం సాగే క్రీడా? మన మీడియా పండితులు, మేధోపరమైన ఉన్నత వర్గాల వారిలో అత్యధికులు ఈ రెండు సందర్భాల్లోనూ మొదటి నిర్వచనాన్నే ఎంచుకున్నారనేది స్పష్టమే. గౌరవనీ యమైన ముంబై హైకోర్టు దానికి ఆమోదముద్రను కూడా వేసింది.
ఐపీఎల్ క్రికెట్ క్రీడ కాదా?
మే నెలలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లన్నిటినీ కోర్టు మహా రాష్ట్ర బయటకు తరలించాలని ఆదేశించింది. అంతే కాదు, క్షామ సహాయ నిధికి సహాయం చేయమని రాష్ట్రానికి చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీలను కోరింది. ఆ ఆదేశాల అంతరార్థాన్ని బట్టి కొన్ని నిర్ధారణలకు రాగలం. మన దేశానికి మరో దేశానికి మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే ఆటగా లెక్క. రెండు, ఐపీఎల్ అంటే సంపన్నులను (జట్టు యజమానులని అర్థం చేసుకోండి) వినోదపరుస్తూ, సొమ్ము చేసుకోవడమే. కాబట్టే క్షామ నిధికి సహాయం చేయమని అడిగారు. అది, ఖలీఫా రాజ్యం జారీ చేసిన ఫర్మాన్ (ఆదేశం) లాగా అనిపిం చిందని అంటున్నందుకు మన్నించాలి. ఒక్కసారి మీరు గనుక ఈ ‘తమాషా’ నిర్వచనాన్ని ఆమోదించారంటే, ఆ తర్వాత అంతా తార్కికంగా దానంతటదే సాగిపోతుంది.
ఒక వంక దుర్భిక్షానికి రైతులు మరణిస్తుండగా సంప న్నుల కోసం అతి ఖరీదైన అట్టహాసపు తమాషాను నిర్వ హించడమే కాదు, అందుకోసం లక్షల లీటర్ల నీటిని వాడటం సిగ్గుమాలినతనం (జనరంజక చర్చకు తగ్గ ట్టుగా నీటిని లీటర్ల కొలమానంలో చెప్పిన విషయాన్ని గమనించండి). ఐపీఎల్ మ్యాచ్‌లను బయటకు గెంటే యడాన్ని సమంజసమైనదిగా చేసేయడానికి అది చాలు. మార్చడానికి వీల్లేనంత బాగా ఆలస్యమైపోయిన మ్యాచ్ లకు ‘‘పరిహారాన్ని’’ చెల్లించండంతే. అంతేకాదు, రాష్ట్రా నికి చెందిన ఫ్రాంచైజీలకు స్వస్థలంలోనే తమ జట్టు ఆడ టమనే అనుకూలతను నిరాకరించడం ఎంత వరకు సమంజసమనే క్రీడకు సంబంధించిన సాధారణ ప్రశ్నను అడగడానికి సైతం వీల్లేదు. అది ఆట కాదు తమాషా అని చెప్పాక అసలే అడగకూడదు.
మనది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా చైనా వంటి నిజమైన క్రీడా దేశం కాదనే వాస్తవాన్ని ముందుగా అంగీ కరిద్దాం. పైగా ఏళ్లు గడిచే కొద్దీ మన దే శం క్రీడ లకు వ్యతి రేకమైనదిగా మారింది. పోటీతత్వంతో సాగే క్రీడను జాతీయవాదంతో కలగలిపి గందరగోళపరచడం మన మొదటి సమస్య. భారత్ మరో దేశంతో ఆడితేనే అది క్రీడ. కాబట్టి కరువు వచ్చినా లేక సునామీ వచ్చినా ఆ ప్రదర్శన కొనసాగాల్సిందే. అదే, ఒక క్లబ్బుకు వ్యతి రేకంగా మరో క్లబ్బుతో ఆడితే... ప్రత్యేకించి ఆ ఆటకు, ఆటగాళ్లకు డబ్బు ముట్టేట్టయితే అది కేవలం సర్కస్.
దేశవాళీ క్రీడ గొంతు నులిమి...
జాతీయవాద స్పృహ బలహీనంగా ఉండి, క్రీడలు ఆడని సమాజాలు జాతీయ గౌరవం ముడిపడి ఉంటే తప్ప ఆటను ప్రేమించలేవు. హాకీ మనకు చివరిసారిగా 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టింది... అది కూడా ఒక్క స్పెయిన్ తప్ప ఇతర హాకీ దిగ్గజాలైన దేశా లన్నీ బహిష్కరించిన మాస్కో ఒలింపిక్స్‌లో. అందుకే మీకు హాకీ క్రీడంటే పట్టదు. ఈ క్రమంలోనే దేశవాళీ హాకీ క్రీడ అంతర్థానమైపోయింది. నెహ్రూ కప్ నుంచి బేటన్ కప్ వరకు దేశీయ హాకీ లీగ్‌లన్నీ కనుమరు గయ్యాయి లేదా వాటిని అరుదుగా మాత్రమే చూస్తారు లేదా మీడియా పట్టించుకుంటుంది. దేశవాళీ పోటీల్లో సాధించే విజయాలకు ఇక ఎలాంటి ప్రతిష్టగానీ, వార్తాప రమైన విలువగానీ లేదని గ్రహించిన హాకీ పోషకులైన సాయుధ సైనిక బలగాలు, ఇండియన్ ఎయిర్‌లైన్స్, రైల్వేల వంటి సంస్థలు సైతం ఆ క్రీడలో ఆసక్తిని కోల్పో యాయి.
ఒకప్పుడు ప్రపంచ స్థాయి హాకీ క్రీడను ప్రదర్శించి, జాతీయ జట్టులో ప్రాతినిధ్యం పొందిన సిక్ రెజి మెంటల్ సెంటర్, బెంగాల్ ఇంజనీరింగ్ గ్రూప్ (సైన్యా నికి చెందినది), ఇండియన్ ఎయిర్‌లైన్స్, పంజాబ్ పోలీస్, బీఎస్‌ఎఫ్ వంటి జట్ల పేర్లు నేడు చాలా మంది విని ఉండరు. ఒక క్రీడను దేశీయంగా గొంతు నులిమేసి, ప్రపంచ రంగస్థలిపై పతకాలు సాధించాలంటే సాధించ లేదు. ఫుట్‌బాల్ విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. డ్యురాండ్ కప్ నుంచి బార్డొలాయ్ ట్రోఫీ వరకు అన్నీ అసందర్భమైనవిగా మారాయి. భారత మానవాభివృద్ధి సూచిక కంటే కూడా దిగువ స్థాయిలో తరచుగా కనిపించే వాటిలో ఫుట్‌బాల్ కూడా ఒకటి.
జాతీయ గౌరవానికి గొప్పదైన క్రీడ దేశవాళీ పోటీల్లో పనికిమాలినది కావడమనేది విద్యావంతులైన, ఆకాంక్షాపరులైన నూతన భారతీయుల్లో లోతుగా వేళ్లూ నుకుపోయిన విశ్వాసం. ఉపాధ్యాయులు, తల్లిదం డ్రులు, టీవీ ప్రబోధకులు అంతా పిల్లలు చదువుకోవాలే తప్ప, ఆటలాడుతూ సమయం వృథా చేయరాదనే సందేశాన్ని పదే పదే వినిపిస్తుంటారు. ‘‘దించిన తల ఎత్తకుండా అలాగే చదువుతూ ఉండు, రాకుమారునివై పోతావు. క్రీడా మైదానంలో సమయం వృథా చేశావో, నీ జీవితమే వృథా’’ అనేలాంటి మాటల్నే తరచుగా మనలో చాలా మందిమి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బాబాల నుంచి వింటుంటాం. న్యాయమూర్తులు కూడా ఆ సమాజం నుంచి వచ్చినవారే.
చదువుల పరుగులతో...
చదువులను, క్రీడలనూ, పోటీ పరీక్షలను, సింథటిక్ ట్రాక్‌పైనో లేక కుస్తీల పట్టాపైనో లేదా ఆస్ట్రోటర్ఫ్‌పైనో పెనుగులాడటాన్నీ పోటీకి పెట్టి చూడటం చివరికి మన క్రీడలను ఎలా నాశనం చేసిందో చూడాలని ఉందా? పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిల్లోని మన ప్రప్రథమ శ్రేణి క్రికెట్ టోర్నమెంట్‌లైన విజ్జీ, కూచ్ బెహార్, రోహిన్‌టన్ బారియా ట్రోఫీలకు ఏ గతిపట్టిందో చూడండి. ఇవి ఒకప్పుడు భారత జట్టు క్రీడాకారులలో అత్యధికులను అందించాయి. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్, హిందూ కళాశాల, చండీగఢ్‌లోని డీఏవీ, పం జాబ్ యూనివర్సిటీ జట్ల మధ్య చారిత్రాత్మకమైన క్రికెట్ వైరం దాదాపుగా అంతర్థానమైపోయింది. ఆ నాలుగు క్యాంపస్ వైరాలూ జాతీయ స్థాయి క్రీడాకారుల కార్ఖా నాల్లా నడిచాయి. ప్రతి ఒక్కరూ చదువుకోవడం, రాసుకోవడంలో తలమునకలవుతూ, ఐఐటీ/జేఈఈ, జిమ్యాట్, లేదా సాట్ తదితర కోచింగ్ తరగతులకు హాజరవుతూ ఉండటంతో ఆ క్యాంపస్ వైరాలన్నీ నేడు కనుమరుగయ్యాయి.
విద్యాసంస్థలు క్రీడాపరమైన విజ యాలకు విలువను ఇవ్వడం లేదు కాబట్టి స్పోర్ట్స్ కోటా ప్రవేశాలు బూటకం. వాటికి కావాల్సింది సీబీఎస్‌ఈ ఫలితాలు, కళాశాల ర్యాంకింగ్‌లు (ఆ విషయంలో క్రీడలకు చాలా తక్కువ ప్రాధాన్యం లభిస్తుంది), లేదా మహత్తరమైన క్యాంపస్‌లోనే జరిగే నియామకాలకు మాత్రమే. సంస్థాగతమైన క్రీడా సంస్కృతి నశించిపోవ డానికి కొట్టవచ్చినట్టుగా కనిపించే ఉదాహరణ, సాయుధ బలగాలే. 45 ఏళ్లలోపు వయస్కులకు ఒక ప్పుడు సర్వీసెస్ రంజీ ట్రోఫీలో బలమైన జట్టుగా ఉండే దని, దానికి చెందిన హేమూ అధికారి భారత జట్టుకు కెప్టెన్‌గా పని చేశారని తెలియకపోవచ్చు. ఒకప్పుడు బాక్సింగ్ రంగాన్ని, ఇతర రకాల ప్రత్యర్థి శరీరాన్ని తాకే క్రీడలన్నిటినీ సైన్యం శాసించింది. ఇటీవల బాలీవుడ్ తెరకెక్కిన మిల్ఖాసింగ్, పాన్‌సింగ్‌లు అక్కడి నుంచి వచ్చినవారే. ఒక్క షూటింగ్‌ను మినహాయిస్తే ఆ క్రీడలన్నిటి గౌరవం నేడు చిన్న రాష్ట్రమైన హరియాణాకు దక్కుతోంది. దురదృష్టకరంగా సాయుధ బలగాలు ఆ క్రీడల నుంచి కార్పొరేట్ శైలి గోల్ఫింగ్ సంస్కృతికి మరలడమే అందుకు కారణం.
దేశవాళీ క్రీడలకు టానిక్
ఒకే ఒక్క ఐపీఎల్ దేశంలోని ఈ పరిస్థితిని మార్చేసింది. అది వీక్షకులను తిరిగి దేశవాళీ క్రికెట్ ఆటను చూడ్డానికి వచ్చేలా చేసింది. ప్రకటనదారులను, స్పాన్సర్లను, సుసంపన్నులైన యజమానులను ఆకర్షించింది. జాతీయ జట్టులో స్థానం సంపాదించలేక మరుగున పడ్డ కనీసం 150 మంది దేశవాళీ క్రికెటర్లకూ, కోచ్‌లు, సలహా దారులు, సీఈఓలుగా రిటైరైన క్రీడాకారులకూ అది విలువను (డాలర్లలో) కల్పిస్తోంది. ఐపీఎల్ విజయం వల్ల భారత హాకీ, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, అన్నిటికీ మించి అద్భుతంగా కబడ్డీ లీగ్‌లు ప్రారంభమయ్యాయి. అవి క్రీడాకారులను సంపన్నులను చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత నిపుణ క్రీడాకారులు ఇక్కడకు వచ్చేలా చేస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్ట్‌ఇండీస్ సహా ప్రతి క్రికెట్ ఆడే దేశమూ తమ సొంత లీగ్ పోటీలను ఏర్పరచుకున్నాయి. క్లబ్ క్రీడ తమాషా కాదు. అది చాలా చాలా పోటీతో కూడిన వ్యాపారం, ప్రత్యేకించి అత్యంత అధ్వాన వ్యాయామ సంస్కృతిగల మన దేశంలాంటి చోట్ల అది సాధ్యమైనంత అతి ఆరో గ్యకర జనరంజక వినోదం. వాణిజ్యపరంగా సాగుతున్న దేశవాళీ క్రీడా పోటీలు మన దేశపు గొప్ప క్రీడా వారస త్వాన్ని పునరుజ్జీవితం చేస్తున్నాయి. లేదు, అవేమీ దుర్భిక్షాన్ని సృష్టించడం లేదు.
పూర్తిగా భిన్నమైన మరో స్థాయిలో, క్లబ్బు విధేయ తలు పెరిగే కొద్దీ, వివిధ దేశాల ఆటగాళ్లు ఒకే జట్టు జెండా కింద ఆడుతున్నారు (అవునండీ, వాణిజ్య పరం గానే). క్రీడలలో పెల్లుబికే అతి జాతీయవాదాన్ని ఇది కాస్త మెతకబారుస్తుంది. దీనికి సంబంధించి నాకు అత్యంత ఇష్టమైన క్షణం... యూరో 2000 ఫుట్‌బాల్ పోటీల్లో ఫ్రాన్స్-హాలెండ్‌ల మధ్య మ్యాచ్ జరుగు తుండగా ఫ్రెంచ్ మిడ్‌ఫీల్డర్ పాట్రిక్ వియెరియా అనుకో కుండానే అలవాటుగా బంతిని హాలెండ్‌కు చెందిన మార్క్ ఓవర్స్‌మార్స్‌కు పాస్ చేసేశాడు. ఇద్దరూ ఒకరి నొకరు చూసి ఇబ్బందిపడుతూ నవ్వుకున్నారు. రెండు పక్షాలకు చెందిన లక్షలాదిమంది మద్దతుదార్లూ నవ్వారు. వారిద్దరూ ఆర్సెనల్ జట్టులో సహ క్రీడాకా రులు. వారు వారి ‘‘సాధారణ’’ పాత్రల ప్రకారం ఆడుతున్నారంతే. ఈపీఎల్, యూరోపియన్, లాటిన్ లీగ్‌లు మహా గంభీరమైన క్రీడా కార్యక్రమాలే తప్ప తమాషాలు కావు. న్యాయమూర్తులు సహా మన ఉన్నత వర్గాల వారు వాటిలో కొన్నిటిని చూస్తే మంచిది.
శేఖర్ గుప్తా,
twitter@shekargupta