నాన్న దర్శకత్వంతో నటించాలి | I want to be directed by my father: Alia Bhatt | Sakshi

నాన్న దర్శకత్వంతో నటించాలి

Published Sat, Dec 28 2013 11:11 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నాన్న దర్శకత్వంతో నటించాలి - Sakshi

నాన్న దర్శకత్వంతో నటించాలి

సినిమా కుటుంబంలోనే పుట్టిపెరిగిన ఆలియా భట్ మనసులో ఒక ఆశ ఉంది. మరేంటో కాదు తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో నటించాలన్నది ఈ 20 ఏళ్ల బ్యూటీ కోరిక. అయితే నాన్న మళ్లీ దర్శకత్వం వహించే అవకాశాలు తక్కువేనని చెబుతోంది. అర్ధ్, సారాంశ్, జఖ్మ్, కార్టూస్ వంటి మంచి సినిమాలు తీసిన భట్ 1999 నుంచి దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. సోదరుడు ముకేశ్ భట్‌తో కలసి విశేష్ ఫిల్మ్స్ అనే బ్యానర్‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. సొంత బ్యానర్‌లో సినిమాల్లోనూ నటించాలని ఆలియా కోరుకుంటోంది. ‘అవును. విశేష్ ఫిల్మ్స్ లోనూ నటించాలనుంది. నాన్న అంటే భయం లేదు. ఆయనలోని జ్ఞానమే భయపెడుతుంది. ఆయన వయసులో నాకంటే చాలా పెద్దవారు కావొచ్చు కానీ మనసు నా వయసుదే. 
 
 ఇంట్లో అందరికంటే ఆయనే ఉత్తేజంగా కనిపిస్తారు’ అని వివరించింది. 
 గత ఏడాది విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో తెరపైకి వచ్చిన ఆలియా సినిమాలు ఈ ఏడాది ఒక్కటీ విడుదల కాలేదు. అయితే చేతిలో మాత్రం దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇంతియాజ్ అలీ తీస్తున్న హైవేలోనూ ఆలియాకు అవకాశం దక్కింది. ప్రస్తుతం దీని షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కరణ్ జోహార్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ తీస్తున్న మూడు సినిమాల్లోనూ ఆలియాకు చాన్స్ రావడంతో ఖుషీగా ఉంది. ఇటీవల విడుదలైన హైవే ట్రయలర్‌లో ఆలియా నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ‘ ఈ వీడియోలో నేను గన్‌తో కాలుస్తున్న దృశ్యాలు చూశాక చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నా మొదటి దానికి పూర్తి విభిన్నమైన సినిమా ఇది. హైవే విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంది. ఇంతియాజ్ అలీతో పనిచేయడం అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది’ అని ఆలియా వివరించింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement