
'మా నాన్న నాకు పెళ్లి చేయట్లేదు'
తండ్రులకు కూతుళ్లంటే ఎక్కడలేని అభిమానం ఉంటుంది. తమ గారాలపట్టి ఎప్పటికీ తమ దగ్గరే ఉండాలని కోరుకుంటారు. తన తండ్రి కూడా అలాగే ఉంటున్నారని, తనకు పెళ్లి చేయాలని ఆయన అనుకోవట్లేదని బాలీవుడ్ అగ్ర నిర్మాత మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ చెబుతోంది.
తండ్రులకు కూతుళ్లంటే ఎక్కడలేని అభిమానం ఉంటుంది. తమ గారాలపట్టి ఎప్పటికీ తమ దగ్గరే ఉండాలని కోరుకుంటారు. తన తండ్రి కూడా అలాగే ఉంటున్నారని, తనకు పెళ్లి చేయాలని ఆయన అనుకోవట్లేదని బాలీవుడ్ అగ్ర నిర్మాత మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ చెబుతోంది. తనతోను, తన సోదరి షహీన్ తోను ఇటీవల ఆయన మాట్లాడారని, 'మీరు ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. మిమ్మల్ని గదిలో పెట్టి తాళం వేసేస్తా' అన్నారని, తామిద్దరిపైనా ఆయనకున్న అచంచల ప్రేమకు ఇది నిదర్శనమని ఆలియా చెప్పింది. తన అక్క బోయ్ఫ్రెండ్ ఎప్పుడైనా తనకు బహుమతులు తెస్తే, నాన్న రెండు తెస్తానని చెబుతారని తెలిపింది.
ఆలియా తాజాచిత్రం 2స్టేట్స్ లో ఒక ముద్దు సన్నివేశం ఉంది. దాని గురించి అడగ్గా, సినిమాల్లో కాబట్టి.. ఆయన ఊరుకుంటున్నారని, అదే తాను ఆయన ఎదురుగా తన బోయ్ఫ్రెండును ముద్దు పెట్టుకుంటే వెంటనే లెంపకాయ ఇవ్వడం ఖాయమని ఆలియా చెప్పింది. ఇంతకుముందు ఆలియా నటించిన హైవే చిత్రం బాగా హిట్టయింది. తాను ఎప్పటికీ నటిగానే ఉండాలనుకుంటున్నాను తప్ప స్టార్ అవ్వాలనుకోవట్లేదని తెలిపింది.