గర్భవతిగా ఉన్నప్పుడు సిగరెట్లు కాల్చా : నటి | Soni Razdan Reveals She Smoked Cigarettes When She Was Pregnant | Sakshi
Sakshi News home page

అలియా కడుపులో ఉండగా చాలా సిగరెట్లు కాల్చాను

Published Wed, Jul 10 2019 7:31 PM | Last Updated on Thu, Jul 11 2019 2:11 PM

Soni Razdan Reveals She Smoked Cigarettes When She Was Pregnant - Sakshi

బాలీవుడ్‌ : 1993లో మహేష్‌ భట్‌ దర‍్శకత్వంలో  వచ్చిన సినిమా గుమ్రహా. ఈ సినిమాలో మహేష్‌ భట్ భార్య, అలియా భట్‌ తల్లి సోని రజ్దానా సిగరెట్లు తాగే మహిళ పాత్ర చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో అలియా కడుపులో ఉన్న విషయం తెలియక ఆ పాత్ర చేశానంటూ ట్వీటర్‌ ద్వారా తన సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమాలో  దివంగత నటి శ్రీదేవి, సంజయ్‌ దత్‌లు హీరో, హీరోయిన్‌లుగా నటించారు.

ఇందులో తన పాత్ర వినూత్నంగా ఉంటూ అందరి ప్రశంసలు అందుకుందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో తను గర్భవతిగా ఉన్న విషయం తెలియక చాలా సిగరెట్లు కాల్చానని చెప్పింది. అలాగే షూటింగ్‌లో శ్రీదేవితో తనకు మంచి అనుబంధం ఎర్పడిందని, అలాంటి గొప్ప నటితో కలిసి నటించానంటే తాను నమ్మలేక పోతున్నానని, ఇది ఓ గొప్ప అనుభూతి అంటూ సోని రజ్దానా ట్వీటర్‌లో పెర్కోన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement