కరణ్ జోహర్ తోనే అన్ని పంచుకుంటా: ఆలియా
సాధారణంగా సినీ తారలు తల్లి, తండ్రి నుంచి సలహాలను తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు.
ముంబై: సాధారణంగా సినీ తారలు తల్లి, తండ్రి నుంచి సలహాలను తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. కాని బాలీవుడ్ తార ఆలియా భట్ మాత్రం ప్రఖ్యాత దర్శకుడు, తండ్రి మహేశ్ భట్ ను సలహాలను తీసుకోవడానికి ఇష్టపడదట. ఎదైనా సలహాలు తీసుకోవాల్సి వస్తే దర్శకుడు కరణ్ జోహార్ ను సంప్రదిస్తానని ఆలియా వెల్లడించింది. కరణ్ జోహర్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారానే ఆలియా బాలీవుడ్ తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.
తాను కెరీర్, లైఫ్, లవ్ లాంటి విషయాలను కరణ్ జోహార్ తో పంచుకుంటానని ఓ ప్రైవేట్ చానెల్ టాక్ షోలో వెల్లడించింది. అర్జున్ కపూర్, వరుణ్ ధావన్ లతో అఫైర్లపై మీడియాలో వస్తున్న పుకార్లపై ఆలియా భట్ వివరణ ఇచ్చింది. అర్జున్, వరుణ్ లు కేవలం సహనటులు మాత్రమేనని, వారితో ఎలాంటి అఫైర్ లేదని ఆలియా స్పష్టం చేసింది.