సినిమాల్లో అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్, వినయంతో కనిపించే హీరోయిన్ అమలాపాల్ బయటక మాత్రం సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొవచ్చు. తరచూ వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా సౌత్‌లో వెలుగు వెలిగిన ఆమె కెరీర్ ఒక్కసారిగా స్లో అయ్యింది. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్స్ అందుకున్న ఆమె కెరీర్ గ్రాఫ్ అంతే తొందరగా పడిపోయింది.
దీనికి ఆమె తీరు ఒక కారణమనే చెప్పొచ్చు. ఈ క్రమంలో కెరీర్ మళ్లీ స్టార్ట్ చేసిన ఈ డస్క్రీ బ్యూటీ ఆడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్‌ను నెట్టికొస్తుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ బిజీగా మారింది. ఇప్పటికే అమల తెలుగులో ‘కుడిఎడమైతే’ అనే వెబ్ సీరిస్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె హందీలో ‘రంజిష్ హీ సహీ’ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇప్పుడు అది జనవరి 13 నుంచి ప్రముఖ ఓటీటీలో వూట్(Voot)లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో అమలాపాల్ మద్యానికి, ధూమపానానికి బానిసైన స్టార్ నటిగా కనిపించనుంది. స్టార్ డైరెక్టర్-నిర్మాత మహేశ్ భట్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో నటి పర్విన్ బాబీ పాత్రలో అమల ఒదిగిపోయిందని, చాలా బాగా నటించిందంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో ఇప్పుడు ఈ ట్రైలర్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుష్పదీప్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను నిర్మాత మహేశ్ భట్ నిర్మించాడు. ఇందులో కథానాయకుడు శంకర్ పాత్రను ’83’ మూవీలో సునీల్ గవాస్కర్‌గా నటించిన తాహిర్ రాజ్ బసీన్ పోషిస్తున్నాడు.
ఈ వెబ్ సీరిస్ స్టోరీ యాభై శాతం మహేశ్ భట్ జీవితమే అని, కొన్ని ఫిక్షన్ అని తాహిర్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. ఇందులో అతడు మహేశ్ భట్ పాత్రలో దర్శకనిర్మాతగా నటించాడు. భార్య పట్ల అత్యంత విధేయుడిగా ఉండే ఆ దర్శకుడి జీవితంలోకి ఓ పాపులర్ నటి, సింగర్ పర్విన్ అడుగుపెట్టడంతో ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ వెబ్ సీరిస్ కథ. ఇందులో అమలాపాల్ దర్శకుడి వైవాహిక జీవితంలో చిచ్చపెట్టే సదరు స్టార్‌గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె మద్యం తీసుకోవడం, సిగరెట్ తాగడం, లిప్‌లాక్ చేయడం వంటి సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఇలా అమలా పాల్ చూసిన నెటిజన్లు ప్రస్తుతం ఆమె పరిస్థితికి అన్వయించుకుని తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment