ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తుకు సంబంధించి రియా చక్రవర్తి శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుశాంత్ కేసును సీబీఐకి ఆదేశించడంతో దర్యాప్తు వేగవంతమైంది. ఈ క్రమంలో పోలీసులు గతేడాది రియా కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తి చిత్రనిర్మాత మహేష్ భట్‌కు 16 కాల్స్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేగాక ఆమె తన తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తితో గత సంవత్సరంలో 1122 సార్లు మాట్లాడారు. (చదవండి: ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?)
రియా మేనేజర్, సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజర్ శృతి మోదీకి 808 కాల్స్ చేశారు. తన సోదరుడు షోయిక్ చక్రవర్తి ఆమె తల్లి సంధ్య చక్రవర్తికి పలుసార్లు ఫోన్ చేశారు. అయితే సుశాంత్ మృతి కేసులో సీబీఐ నిన్న(గురువారం) రియా, షోయిక్ ఇంద్రజిత్, రియా తల్లి సంధ్య చక్రవర్తితో సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అంతేగాక సీబీఐ ఎఫ్ఐఆర్ జాబితాలో సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీ కూడా ఉన్నారు. అలాగే సుశాంత్ సింగ్ హౌస్ మేనేజర్, రియా సహచరుడు శామ్యూల్ మిరాండాపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. (చదవండి: సుశాంత్ కేసు: అసలు ఎవరీ శ్రుతి మోదీ)
Comments
Please login to add a commentAdd a comment