Call data details
-
రియా కాల్ రికార్డు: మహేష్ భట్‌కు 16 కాల్స్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తుకు సంబంధించి రియా చక్రవర్తి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుశాంత్ కేసును సీబీఐకి ఆదేశించడంతో దర్యాప్తు వేగవంతమైంది. ఈ క్రమంలో పోలీసులు గతేడాది రియా కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తి చిత్రనిర్మాత మహేష్ భట్‌కు 16 కాల్స్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేగాక ఆమె తన తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తితో గత సంవత్సరంలో 1122 సార్లు మాట్లాడారు. (చదవండి: ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?) రియా మేనేజర్, సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజర్ శృతి మోదీకి 808 కాల్స్ చేశారు. తన సోదరుడు షోయిక్ చక్రవర్తి ఆమె తల్లి సంధ్య చక్రవర్తికి పలుసార్లు ఫోన్ చేశారు. అయితే సుశాంత్ మృతి కేసులో సీబీఐ నిన్న(గురువారం) రియా, షోయిక్ ఇంద్రజిత్, రియా తల్లి సంధ్య చక్రవర్తితో సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అంతేగాక సీబీఐ ఎఫ్ఐఆర్ జాబితాలో సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీ కూడా ఉన్నారు. అలాగే సుశాంత్ సింగ్ హౌస్ మేనేజర్, రియా సహచరుడు శామ్యూల్ మిరాండాపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. (చదవండి: సుశాంత్ కేసు: అసలు ఎవరీ శ్రుతి మోదీ) -
కాల్‌డేటా ఆధారంగా సిట్ దర్యాప్తు
-
కాల్ డేటా రికార్డు కేసులో కంగనా, ఆయేషా
సాక్షి, ముంబయి : ఫోన్ కాల్ వివరాలను రికార్డు చేసిన కేసులో తొలుత బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పేరు వినిపించడంతో పెనుదుమారం రేగింది. తాజాగా ఈ కేసులో పలువురు సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. కాల్ డేటా రికార్డు (సీడీఆర్) కేసులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, నటుడు జాకీ ష్రాఫ్ భార్య ఆయేషా ష్రాఫ్ పేర్లు వెలుగులోకి వచ్చాయని థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. అరెస్టయిన న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి నుంచి థానే పోలీసులు నటుడు సాహిల్ ఖాన్ కాల్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయేషా ష్రాఫ్ ఈ వివరాలను సిద్ధిఖికి అందచేసినట్టు వెల్లడైందని థానే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అభిషేక్ త్రిముఖి తెలిపారు. రిజ్వాన్ మొబైల్‌ను పరిశీలించగా ఆయేషా ష్రాఫ్ సాహిల్ ఖాన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలను షేర్ చేసినట్టు విచారణలో వెల్లడైందన్నారు. అయేషా ష్రాఫ్‌కు సాహిల్ ఖాన్‌తో సంబంధం ఉందని, వీరిద్ధరి మధ్య వివాదం తలెత్తడంతో కాల్ డేటా వివరాలను ఆమె రిజ్వాన్‌కు పంపారని చెప్పారు. మరోవైపు ప్రముఖ బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ 2016లో నటుడు హృతిక్ రోషన్ మొబైల్ నెంబర్‌ను సిద్ధిఖీకి షేర్ చేశారని డీసీపీ వెల్లడించారు. ఆమె ఎందుకు హృతిక్ నెంబర్ పంపారనేది వెల్లడికాలేదని..దీనిపై విచారణ జరుగుతున్నదని చెప్పారు.తొలుత కేసులో నవాజుద్దీన్ సిద్ధిఖీకి పోలీసులు సమన్లు జారీ చేయగా కేసులో నటుడు నవాజుద్దీన్‌కు సంబంధం ఉందని భావించారు. తన భార్య అలియా సిద్ధిఖీపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే కాల్ డేటా కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం సాక్షిగానే ఆయనను పిలిపించామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా అక్రమంగా సంపాదించిన కాల్ డేటా రికార్డులను లాయర్లు ఇతరులకు విక్రయించి సొమ్ముచేసుకునే ప్రైవేట్ డిటెక్టివ్‌ల రాకెట్ సాగుతోందని ఆరోపణలున్నాయి. కాల్ డేటా రికార్డు కేసులో థానే పోలీసులు ఇప్పటివరకూ 12 మందిని అరెస్ట్ చేశారు. -
నా భర్త మంచోడు.. అనుమానాల్లేవ్!
సాక్షి, ముంబై : కాల్ రికార్డ్ డేటా స్కామ్‌లో అడ్డంగా బుక్కైన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి ఊరట లభించింది. తన భర్త చాలా మంచోడని.. ఎలాంటి అనుమానాలు లేవని సిద్ధిఖీ భార్య అంజలి(ఆలియా సిద్ధిఖీ) చెబుతున్నారు. సీఆర్డీ స్కామ్‌కు ఆయనకు సంబంధం లేదని ఆమె వాదిస్తున్నారు. ‘నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఆయనో సెలబ్రిటీ. అందుకే ఆయన పేరును ఇలా బద్నాం చేస్తున్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి మన్స్పర్థలు లేవు. అనవసరంగా ఆయన్ని స్కామ్‌లో ఇరికిస్తున్నారు. గతంలో కూడా మా వైవాహిక జీవితం గురించి రకరకాల కథనాలు వచ్చాయి. కానీ, అవి ఉత్తవేనని తర్వాత తేలింది. ఇప్పుడు కూడా అంతే. ఆయన నిర్దోషిగా బయటపడతారన్న నమ్మకం ఉంది.’ అని ఆలియా తన ఫేస్ బుక్‌లో ఓ సుదీర్ఘ పోస్టును ఉంచారు. కాగా, భార్యపై అనుమానంతో డిటెక్టివ్‌ను నియమించిన సిద్ధిఖీ.. ఆమె కాల్ డేటాను సేకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో థానే పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేశారు. మరోవైపు సిద్ధిఖీ కూడా ఈ వ్యవహారాన్ని కుట్రగా కొట్టేశాడు. మరోవైపు ఈ స్కామ్‌లో పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. -
భవానీపురం పీఎస్ కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మరో కేసులో కాల్‌డేటా వివరాలను ఇవ్వాలని వొడాఫోన్, టాటా టెలీ సర్వీసులను ఆదేశిస్తూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విజయవాడ సీఎంఎం కోర్టులో జరుగుతున్న విచారణలో తదుపరి చర్యలన్నింటినీ కూడా నిలిపేసింది. వొడాఫోన్, టాటా టెలీ సర్వీసుల నుంచి కాల్ డేటాకు సంబంధించిన సీల్డ్ కవర్లు అందుకున్న వెంటనే వాటిని ప్రత్యేక దూత ద్వారా హైకోర్టుకు పంపాలని సీఎంఎం కోర్టును హైకోర్టు ఆదేశించింది. సీల్డ్ కవర్లు అందుకున్న తరువాత వాటిని భద్రపరచాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో కాల్ డేటా వివరాలు ఇవ్వాలని వొడాఫోన్, టాటా టెలీ సర్వీసులను ఆదేశిస్తూ విజయవాడ సీఎంఎం కోర్టు గత నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్వీసు ప్రొవైడర్లలో వొడాఫోన్, టాటా టెలీ లేదని, అందువల్ల వారు కాల్ డేటా వివరాలను సీఎంఎం కోర్టుకు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు సైతం వొడాఫోన్, టాటా టెలీ సర్వీసులకు కాల్ డేటా వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వలేదన్నారు. కాల్ డేటా వివరాలను సమర్పించాల్సిన అవసరమే లేనప్పుడు వాటిని హైకోర్టుకు వచ్చేలా చేయాలని కోరడం అర్థం లేదన్నారు. ఈ వాదనలతో ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ విభేదిస్తూ, ఇదే వ్యవహారంపై గత నెల 13న ఇదే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, అందువల్ల వాటిని ఈ కేసుకూ వర్తింపజేయాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, విజయవాడ సీఎంఎం కోర్టులో భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి జరుగుతున్న కేసు విచారణలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు.