నా భర్త మంచోడు.. అనుమానాల్లేవ్‌! | CDR Scam wife Backs Nawazuddin Siddiqui | Sakshi
Sakshi News home page

సీఆర్‌డీ స్కామ్‌.. సిద్ధిఖీకి దన్నుగా నిలిచిన భార్య

Published Sun, Mar 11 2018 2:44 PM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

CDR Scam wife Backs Nawazuddin Siddiqui - Sakshi

నవాజుద్దీన్‌ సిద్ధిఖీ దంపతులు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై : కాల్‌ రికార్డ్‌ డేటా స్కామ్‌లో అడ్డంగా బుక్కైన బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీకి ఊరట లభించింది. తన భర్త చాలా మంచోడని.. ఎలాంటి అనుమానాలు లేవని సిద్ధిఖీ భార్య అంజలి(ఆలియా సిద్ధిఖీ) చెబుతున్నారు. సీఆర్‌డీ స్కామ్‌కు ఆయనకు సంబంధం లేదని ఆమె వాదిస్తున్నారు. 

‘నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఆయనో సెలబ్రిటీ. అందుకే ఆయన పేరును ఇలా బద్నాం చేస్తున్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి మన్స‍్పర్థలు లేవు. అనవసరంగా ఆయన్ని స్కామ్‌లో ఇరికిస్తున్నారు. గతంలో కూడా మా వైవాహిక జీవితం గురించి రకరకాల కథనాలు వచ్చాయి. కానీ, అవి ఉత్తవేనని తర్వాత తేలింది. ఇప్పుడు కూడా అంతే. ఆయన నిర్దోషిగా బయటపడతారన్న నమ్మకం ఉంది.’ అని ఆలియా తన ఫేస్‌ బుక్‌లో ఓ సుదీర్ఘ పోస్టును ఉంచారు.

కాగా, భార్యపై అనుమానంతో డిటెక్టివ్‌ను నియమించిన సిద్ధిఖీ.. ఆమె కాల్‌ డేటాను సేకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో థానే పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేశారు. మరోవైపు సిద్ధిఖీ కూడా ఈ వ్యవహారాన్ని కుట్రగా కొట్టేశాడు. మరోవైపు ఈ స్కామ్‌లో పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement