ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్, ఆయన కుటుంబం తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు నటి లువైనా లోధ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లువినా ఆరోపణలను ఖండిస్తూ మహేష్ భట్ న్యాయవాది శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ప్రకటనలో పేర్కొన్నారు. ‘లువైనా లోధ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి మాత్రమే కాదు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయి. తను విడుదల చేసిన వీడియో చట్ట పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది. ఈ ఆరోపణలను మా క్లైయింట్ మహేష్ భట్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన విడుదల చేశారు. (చదవండి: పర్వీన్ కోసం వాళ్లను కాదనుకున్నాడు)
మహేష్ భట్, ఆయన కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల లువైనా లోధ్ వీడియో పోస్టు చేశారు. 1 నిమిషం 48 సెకన్‌ల నిడివి గల ఈ వీడియోలో తనను తాను పరిచయం చేసుకుని ఆ తర్వాత తను, తన కుటుంబ భద్రత కోసమే ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా తాను మహేష్ భట్ మేనల్లుడు సుమిత్ సబర్వాల్‌ను వివాహం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. (చదవండి: ప్రపంచ రికార్డు కొట్టేసిన సడక్ 2)
Comments
Please login to add a commentAdd a comment