ఈ హీరో అసలు పేరు తెలుసా? | This is how Rajiv Bhatia became Akshay Kumar | Sakshi
Sakshi News home page

ఈ హీరో అసలు పేరు తెలుసా?

Published Wed, Jun 29 2016 6:59 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

ఈ హీరో అసలు పేరు తెలుసా?

ఈ హీరో అసలు పేరు తెలుసా?

యాక్షన్‌ సూపర్ స్టార్ అక్షయ్‌ కుమార్ బాలీవుడ్‌లో అడుగుపెట్టి అప్పుడే 25 ఏళ్లు పూర్తయింది. 1991లో సౌగంధ్ సినిమాతో ఆయన బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. కానీ నిజానికి 1987లోనే అక్షయ్‌ వెండితెరపై కనిపించారు. దర్శకుడు మహేశ్ భట్ తీసిన ‘ఆజ్‌’ సినిమాలో ఆయన కరాటే శిక్షకుడిగా కేవలం పదిసెనక్లపాటు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు.

ఈ సినిమాలో అక్షయ్‌ కనిపించింది తక్కువసేపే అయినా అతనికి ఇది మాత్రం స్పెషల్ సినిమాగా నిలిచిపోయింది. వాస్తవానికి అక్షయ్ అసలు పేరు రాజీవ్‌ భాటియా. కానీ ‘ఆజ్’ సినిమాతోనే అతనికి స్క్రీన్ నేమ్ అక్షయ్‌ కుమార్‌గా స్థిరపడిపోయింది. ‘ఆజ్‌’ సినిమాలో హీరో పాత్ర పోషించిన కుమార్ గౌరవ్ పేరు అక్షయ్‌ కుమారే. ఆ పేరు బాగా నచ్చడంతో దానిని తన అధికారిక పేరుగా అక్షయ్‌ ఫిక్స్ చేశాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులు పెట్టిన రాజీవ్‌ భాటియా పేరు అంటే కూడా తనకు ఇష్టమేనని, కానీ బాలీవుడ్‌లో హీరో అవతారంలో కనిపించడానికి అక్షయ్‌ కుమార్ పేరే సరిగ్గా తనకు సూట్‌ అయిందని, చక్కని ధ్వనితో ఉన్న ఆ పేరును ఆయన అమితంగా ఇష్టపడతారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో కుటుంబసభ్యులతో కలిసి విహరిస్తున్న అక్షయ్‌ పేరు మార్చుకున్న విషయంలో కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement