'మహేశ్ భట్ మూర్కుడు'
ముంబై: పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను ప్రదర్శించరాదని సినిమా ధియేటర్ యజమానుల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) స్వాగతించింది. పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఎమ్మెన్నెస్ నాయకుడు అమేయ్ ఖోపకార్ పునరుద్ఘాటించారు.
దర్శకుడు మహేశ్ భట్ మూర్కుడిలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహేశ్ భట్ భారతీయులా వ్యవహరించడం లేదని, ఆయనను పాకిస్థాన్ కు పంపించాలని డిమాండ్ చేశారు. ఆయనేం మాట్లాడినా లెక్కచేయబోమని అన్నారు. పాకిస్థాన్ నటీనటులతో సినిమాలు తీస్తే దాడులు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
కొంతమంది హింసోన్మాదులు చేసిన మతిలేని చర్యలకు తనలాంటి ఎంతోమంది శాంతికాముకులను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదని 'ప్రొఫైల్ ఫర్ పీస్' నినాదంతో మహేశ్ భట్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.