
ముంబై: హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి వారం దాటుతున్న బాలీవుడ్‌లో మాత్రం ఇంకా ఆ మంటలు చల్లారలేదు. ప్రస్తుతం సుశాంత్ మరణానికి సంబంధించిన కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, మహేష్ భట్ కలిసివున్న పాత ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. దీనితో పాటు సుశాంత్ చనిపోవడానికి ముందు అతని ఫ్లాటులో సీసీ కెమెరాలు ఆఫ్ చేయబడ్డాయని, కొంత మంది స్నేహితులు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు రాత్రి అతని గదికి వచ్చినట్లు చెబుతున్నారు. అప్పుడు అతని ఫ్లాట్ నుంచి ఒక శబ్ధం వినిపించిందని, కానీ అది డిప్రషన్‌లో అరిచే అరుపు కాదని అంటున్నారు. (సుశాంత్ ఆత్మహత్య: స‌్పందించిన సల్మాన్)
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తాడు మీద అతని చూపుడు వేలు, మధ్యవేలు, చిటికెన వేలు గుర్తులు మాత్రమే ఉన్నాయని మిగిలిన వేలి గుర్తులు లేవని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాటు సుశాంత్ ఆత్మహత్యకు ముందు రియా చక్రవర్తి సుశాంత్‌తో ఉన్న ఫోటోలన్నింటిని సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు కూడా వైరల్ వీడియోలో ఉంది. ఇంకా సుశాంత్ ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడని మహేష్‌భట్ అన్నారని అది ఈ రోజు నిజమయ్యిందని, రియాతో సన్నిహితంగా ఉంటే చంపేస్తామని సుశాంత్‌ను ఎవరో బెదిరించినట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రియా, మహేష్ భట్ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలు ఎంత వరకు నిజమో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. రియాను సుశాంత్ చనిపోయిన తర్వాత పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment