'నా కూతురు సూపర్' | Alia Bhatt is much more successful than I imagined: Mahesh Bhatt | Sakshi
Sakshi News home page

'నా కూతురు సూపర్'

Published Wed, Aug 17 2016 6:53 PM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM

'నా కూతురు సూపర్' - Sakshi

'నా కూతురు సూపర్'

ప్రముఖ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్.. కుమార్తె అలియా విజయం చూసి గర్వపడుతున్నారు. ఊహించినదాని కంటే ఆమె ఎక్కువ విజయాన్ని సాధించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్.. తన కుమార్తె అలియా విజయం చూసి గర్వపడుతున్నారు. ఊహించిన దాని కంటే ఆమె ఎక్కువ విజయాన్ని సాధించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైవే, టూ స్టేట్స్, హంప్టీ శర్మ కీ దుల్హనియా, కపూర్ అండ్ సన్స్, తాజాగా ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాలతో అటు కమర్షియల్గా సక్సెస్ అందుకోవడంతోపాటు నటిగా కూడా ప్రశంసలు అందుకుంటోంది ఆలియా. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు కావస్తుండగా కూతురి కెరీర్ గురించి మహేష్ భట్ సంతోషం వ్యక్తం చేశారు.

అయితే.. అంతా బాగానే ఉంది, ఇక ఇప్పుడు ఫెయిల్యూర్ని కూడా అలియా రుచి చూడాలంటున్నారు ఆమె తండ్రి. ఆమె కూడా అందరిలా సాధారణ మనిషే కదా, విజయంతో పాటు అపజయం ఎలా ఉంటుందో కూడా అలియాకు తెలియాలని  అన్నారు. 'ఉడ్తా పంజాబ్'లో ఆమె నటన చూసి అబ్బురపడ్డాను, అంత భావోద్వేగపూరితమైన నటనను అలియా ఎలా కనబరిచగలిగిందా అని ఆశ్చర్యానికి లోనయ్యాను' అని ఆయన తెలిపారు. ఇంత చిన్న వయసులో అలియా (23) సాధిస్తున్న విజయాలను చూసి గర్వపడుతున్నానని చెప్పారు.

అయితే ఇతర హీరోయిన్ల మాదిరిగా అలియా హాలీవుడ్కి వెళ్లేందుకు ఆసక్తి కనబరిస్తే మీరు ఓకే చెబుతారా అంటూ ప్రశ్నించగా.. తానెప్పుడూ కూతురికి అండగా ఉంటానని మహేష్ భట్ తెలిపారు. తన జీవితానికి తనే మాస్టర్ అని, తనకేం కావాలో ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఆమెకు ఉందని, తండ్రిగా తానెప్పుడూ ఆమె పక్కనే ఉండి ప్రోత్సహిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement