Mahesh Bhatt Praises His Daughter Alia Bhatt For Her Success In Movies - Sakshi
Sakshi News home page

Alia Bhatt And Mahesh Bhatt: ‘తన రెండేళ్ల సంపాదన.. నాకు 50 ఏళ్లు పట్టింది’

Published Sun, Nov 14 2021 2:26 PM | Last Updated on Sun, Nov 14 2021 4:09 PM

Mahesh Bhatt Praises His Daughter Alia Bhatt For Her Success In Movies - Sakshi

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అలియా భట్‌ తోలి సినిమాతో భారీ విజయం సాధించింది. ప్రముఖ ప్రొడ్యూసర్‌ మహేశ్‌ భట్‌ వారసురాలిగా సినిమాల్లోకి అడుగు పెట్టి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా పేరు తెచ్చుకుంది. ఇక సంపాద‌న విష‌యంలో అయితే తండ్రినే మించిపోయిందట‌. ఈ విషయంలో అలియా గురించి చెబుతూ మురిసిపోతున్నాడు మహేశ్‌ భట్‌.  తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆలియా గురించి మాట్లాడుతూ.. ‘సినిమా రంగంతో పాటు ఎక్క‌డైనా స‌రే రాణించాలంటే టాలెంట్ ఉండాలి.

చదవండి: మరో వివాదంలో చిక్కుకున్న రాజ్‌కుంద్రా దంపతులు

కొంత‌మంది త‌మ టాలెంట్‌తో చిన్న వ‌య‌సులోనే ఉన్నత శిఖ‌రాల‌ను అధిరోహిస్తున్నారు. అందులో నా కూతురు అలియ ఉండటం గర్వంగా ఉంది. తన టాలెంట్‌తో ఆలియా మంచి పేరుని సంపాదించడమే కాక నేను 50 ఏళ్లలో క‌ష్ట‌ప‌డి సంపాదించినంత డ‌బ్బును ఆలియా కేవ‌లం రెండేళ్ల‌లోనే సంపాదించింది’ అంటూ తండ్రిగా మురిపిపోయాడు. అయితే గతేడాది అలియా లండన్‌లో ఓ విల్లా కొనుగోలు చేయగా ఇటీవల ముంబైలోని జూహులో ఓ ఇల్లు ఖరీదు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అలియా సినిమాల విషయానికోస్తే ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ బడ్జెట్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె తెలుగులో నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, హాందీ బ్రహాస్త్ర చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకోని విడుదలకు సిద్దమవుతున్నాయి. 

చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement