అలియాకు ప్రేమతో... | Raazi Movie Got Success Talk And Mahesh Bhatt Appreciate Alia | Sakshi
Sakshi News home page

అలియాకు ప్రేమతో...

Published Mon, May 14 2018 6:33 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Raazi Movie Got Success Talk And Mahesh Bhatt Appreciate Alia - Sakshi

రాజీ చిత్రంలో అలియా భట్‌

ముంబై: అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాజీ’ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం ‘రాజీ’ విజయాన్నిఎంజాయ్‌ చేస్తున్న అలియాకు మరో కానుక అందింది. ‘రాజీ’ విజయవంతమైన సందర్భంగా అలియ తండ్రి మహేష్‌ భట్‌ కూతురును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా అలియాను ఉద్దేశిస్తూ ట్విటర్లో ‘నా ప్రియమైన అలియా నిన్ను చూసి నేను చాలా సంతోష పడుతున్నాను, నువ్వు ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి. నిన్ను నువ్వు మెరుగుపర్చుకోవడాన్ని ఒక వ్యసనంగా మార్చుకో.. ప్రేమతో మీ నాన్న’ అంటూ మేసేజ్‌ చేశారు.

శుక్రవారం విడుదలైన ‘రాజీ’ సినిమా తొలిరోజు 7.53 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అయితే వారాంతంలో(శని, ఆదివారాల్లో) 50 శాతం అధికంగా వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో ఇండియాలో రూ. 32.94 కోట్ల కలెక్షన్లు తెచ్చుకుంది.

అలియా నటన, బలమైన కథ ‘రాజీ’ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ‘రాజీ’ చిత్రాన్ని హరిందర్‌ సిక్క రాసిన పుస్తకం ‘కాలింగ్‌ సేహమత్‌’ ఆధారంగా తెరకెక్కించారు. గూఢచర్యం నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో అలియా పాక్‌ సైనిక రహస్యాలను భారతీయ ఆర్మీకి చేరవేసే ‘స్పై’గా అద్భుతంగా నటించి విమర్శకులను సైతం మెప్పించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement