‘శ్రీదేవి అందుకు ఒప్పుకోలేదు’ | Mahesh Bhatt Sharing About Sridevi Hardworking | Sakshi
Sakshi News home page

‘శ్రీదేవి అందుకు ఒప్పుకోలేదు’

Published Fri, Mar 9 2018 11:05 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Mahesh Bhatt Sharing About Sridevi Hardworking - Sakshi

శ్రీదేవి, మహేష్‌భట్‌ (ఫైల్‌)

ముంబై : ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం నుంచి అభిమానులు, ఆమెతో పనిచేసిన నిర్మాతలు, దర్శకులు, సహ నటులు ఇంకా తేరుకోలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆమె జ్ఞాపకాలను గర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ దర్శక నిర్మాత మహేష్‌భట్‌.. శ్రీదేవికి సినిమాల పట్ల ఉన్న అంకితభావాన్ని వెల్లడించారు. ‘‘ఇండియాస్‌ నెక్స్ట్‌ సూపర్‌ స్టార్‌’’(ఔత్సాహిక నటినటులను ప్రోత్సాహించే షో) కార్యక్రమానికి హాజరైన భట్‌ తన అభిమాన నటి శ్రీదేవికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీదేవికి సినిమాల పట్ల ఉన్న అంకితభావానికి అద్దం  పట్టే ఘటన గురించి చెప్పారు.

‘గుమ్రాహ్‌ చిత్రాన్ని తీసేటప్పుడు నీటిలో తడుస్తూ నటించే సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి వచ్చింది. కానీ అప్పటికే శ్రీదేవి జ్వరంతో బాధపడుతున్నారు. శ్రీదేవి దగ్గరకు వెళ్లి షూటింగ్‌ను వాయిదా వేద్దామని చెప్పాను. కానీ శ్రీదేవి అందుకు ఒప్పుకోలేదు. జ్వరంతో బాధపడుతూనే గంటల తరబడి నీటిలో తడుస్తూ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆమెకు అంతటి అంకితభావం, కష్టపడే స్వభావం ఉన్నాయి కాబట్టే గొప్ప నటిగా ఎదిగార’ని మహేష్‌భట్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement