Hardwork
-
ఈ అక్కచెల్లెళ్లు సూపర్..
సాక్షి, కామారెడ్డి: వాళ్లిద్దరు అక్కా చెల్లెళ్లు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నరు. సొంత ఇళ్లు లేదు. సొంతంగా పంట భూమి కూడా లేదు. కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరిలా కాకుండా పద్దతిగా పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మగవారికి ధీటుగా మంచి పంటలు పండిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు పెద్ద మల్లవ్వ, చిన్న మల్లవ్వలు చేస్తున్న పంటల సాగు నలుగురికి మెచ్చేలా, నచ్చేలా ఉంటోంది. పొద్దున నిద్రలేచి ఇద్దరూ కలిసి వంట పని చేసుకుని సద్దిమూటతో కాలినడకన పొలం బాటపడతారు. సాయంత్రానికి గానీ ఇంటికి రారు. మగవారికి ధీటుగా పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. పెద్ద మల్లవ్వకు కూతురు జమున ఏడాదిన్నర వయసులో ఉన్నపుడు భర్త గంగారెడ్డి చనిపోయాడు. దీంతో తల్లిగారి ఊరయిన కుప్రియాల్‌కు వచ్చి ఉంటోంది. కూలీనాలీ చేసి బిడ్డను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. చిన్న మల్లవ్వ భర్తకు దూరమై అక్కతో కలిసి ఉంటోంది. పదేళ్లుగా అక్కా చెల్లెల్లిద్దరూ అద్దె ఇళ్లు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో వెంకటరెడ్డికిక చెందిన నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. భూమి యజమాని సహకారంతో ఈ ఇద్దరు అక్కా చెల్లెల్లు ఆధునిక పద్దతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రెండెకరాల్లో చెరకు పంట, ఎకరంనర భూమిలో వరి సాగు చేస్తున్నారు. మిగతా స్థలంలో కూరగాయలు పండిస్తున్నారు. చెరకు సాగులో అధిక దిగుబడులు.... ఈ అక్కాచెల్లెల్లు సాగు చేస్తున్న చెరకు పంట అధిక దిగుబడులు వస్తోంది. నాటడం నుంచి అన్ని పనులూ వీళ్లిద్దరే చేసుకుంటారు. చెరకు నరకడానికి మాత్రమే కూలీలు వస్తారు. మిగతావన్నీ వాళ్లే చూసుకుంటారు. చెరకు నాటడం, కలుపు తీయడం నుంచి ప్రతీ పని వాళ్లే చేసుకుంటారు. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. గత ఏడాది ఎకరాకు 55 టన్నుల దిగుబడి సాధించారు. ప్రతీ సంవత్సరం చెరకు సాగులో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సారి కూడా అదే స్థాయిలో దిగుబడి వస్తుందని చెబుతున్నారు. పంటకు కోడి ఎరువు, పశువుల పేడ వాడుతారు. చాలా మంది వీళ్ల సాగు విధానాన్ని చూసి వెళుతుంటారు. గాయత్రీ షుగర్స్ అధికారులు కూడా మల్లవ్వలు సాగు చేస్తున్న పంటను చూడమని ఇతర గ్రామాల రైతులకు చెబుతుంటారు. కూలీకి వెళ్లరు..కూలీలను పిలవరు... ఇద్దరు అక్కా చెల్లెళ్లు తాము సాగు చేస్తున్న పంట చేనుదగ్గరకు ప్రతీ రోజూ వెళ్లి పనులు చూసుకుంటారు. గ్రామం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న పొలం దగ్గరికి కాలినడకన వస్తారు. సాయంత్రం తిరిగి కలిసి వెళతారు. ఏ ఒక్కనాడూ కూలీ పనులకు వెళ్లరు. తమ పొలానికి కూలీలను పిలవరు. పంటకు రసాయన ఎరువులను కూడా వీళ్లే పిచికారీ చేస్తారు. భుజానికి స్ప్రే పంప్ తగిలించుకుని దర్జాగా పొలంలో తిరుగుతూ పంటకు పిచికారీ చేస్తారు. ప్రతీ పనిని తామే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే కూరగాయల సాగు ద్వారా చేతి ఖర్చులన్నీ వెల్లదీసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం ఉంది.... మాకు సొంత భూమి లేకున్నా వెంకటరెడ్డి సారు భూమిని సాగు చేసుకుని బతుకుతున్నం. మాకు సారు అన్ని విధాల సహకారం అందిస్తారు. పొలం పని మీద దృష్టి పెడితే మంచి ఫలితాలే వస్తాయి. ఎప్పుడో ఒక సారి నష్టం రావచ్చు. రెక్కల కష్టం నమ్ముకుని బతుకుతున్న మాకైతే మంచిగనే ఉన్నది. ఎవల మీద ఆధారపడకుండా మా పని మేము చేసుకుని బతుకుతున్నం. మాకు సొంత ఇళ్లు లేదు. జాగ లేదు. అదొక్కటే బాధ ఉంది. వంగి కష్టం చేస్తే మంచి పంటలు తీయవచ్చు. –పెద్ద మల్లవ్వ, చిన్న మల్లవ్వ -
‘శ్రీదేవి అందుకు ఒప్పుకోలేదు’
ముంబై : ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం నుంచి అభిమానులు, ఆమెతో పనిచేసిన నిర్మాతలు, దర్శకులు, సహ నటులు ఇంకా తేరుకోలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆమె జ్ఞాపకాలను గర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్‌భట్.. శ్రీదేవికి సినిమాల పట్ల ఉన్న అంకితభావాన్ని వెల్లడించారు. ‘‘ఇండియాస్ నెక్స్ట్ సూపర్ స్టార్’’(ఔత్సాహిక నటినటులను ప్రోత్సాహించే షో) కార్యక్రమానికి హాజరైన భట్ తన అభిమాన నటి శ్రీదేవికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీదేవికి సినిమాల పట్ల ఉన్న అంకితభావానికి అద్దం పట్టే ఘటన గురించి చెప్పారు. ‘గుమ్రాహ్ చిత్రాన్ని తీసేటప్పుడు నీటిలో తడుస్తూ నటించే సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి వచ్చింది. కానీ అప్పటికే శ్రీదేవి జ్వరంతో బాధపడుతున్నారు. శ్రీదేవి దగ్గరకు వెళ్లి షూటింగ్‌ను వాయిదా వేద్దామని చెప్పాను. కానీ శ్రీదేవి అందుకు ఒప్పుకోలేదు. జ్వరంతో బాధపడుతూనే గంటల తరబడి నీటిలో తడుస్తూ షూటింగ్లో పాల్గొన్నారు. ఆమెకు అంతటి అంకితభావం, కష్టపడే స్వభావం ఉన్నాయి కాబట్టే గొప్ప నటిగా ఎదిగార’ని మహేష్‌భట్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. -
జిమ్నాస్టిక్స్
అబ్బురపరిచే విన్యాసాలు చేస్తున్న యువతేజాలు కఠోరమైన సాధనతో ప్రత్యేక గుర్తింపు ఓరుగల్లు పేరును నలుదిశలా చాటుతున్న క్రీడాకారులు జాతీయ స్థాయిలో అనేక పతకాలు ‘‘ఒకటే గమనం.. ఒకటే పయనం.. గెలుపు పొందే వరకూ.. అలుపులేదు మనకు..’’ అని ఓ సినీకవి రాసిన పాటను వీరు అక్షరాల పాటిస్తున్నారు. కష్టాలు వచ్చినా.. కన్నీళ్లు వచ్చినా.. వాటిని దిగమింగుకుని లక్ష్యసాధనకు పాటుపడుతున్నారు. నిత్యం కఠోరమైన సాధనతో అబ్బురపరిచే విన్యాసాలు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. క్రమశిక్షణ.. అంకితభావానికి మారుపేరుగా నిలిచే ‘జిమ్నాస్టిక్్స’లో జిల్లాకు చెందిన పలువురు యువతేజాలు రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. –వరంగల్ స్పోర్ట్స్ దీపా కర్మాకర్ స్ఫూర్తిగా.. మేటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి ‘దీపా కర్మాకర్’ భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డ. మునుపెన్నడూ లేని రీతిలో ఆమె దేశచరిత్రను తిరగరాసింది. తాజాగా జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శనతో జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్స్‌కు చేరడం గమనార్హం. అయితే ప్రపంచ ప్రజలందరి దృష్టిని ఆక్షరించిన 23 ఏళ్ల దీపా కర్మాకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని మన జిల్లాకు చెందిన విద్యార్థులు, యువకులు జిమ్నాస్టిక్స్‌లో సత్తాచాటుతున్నారు. 1570లో ఆవిర్భావం.. జిమ్నాస్టిక్స్ అంటే వాడుక భాషలో సర్కస్ ఫీట్లు అని అర్థం. బలం, సమతుల్యత, చురుకుదనం, ఓర్పు, నియంత్రణ కలగలిపిన వ్యాయామాల ప్రదర్శనే జిమ్నాస్టిక్స్ అని చెప్పొచ్చు. ఈ క్రీడ 1570లో పురాతన గ్రీసులో ఆవిర్భవించింది. 1759–1839 మధ్య కాలంలో జర్మనీలో భౌతిక విద్యావేత్త జోహన్ ఫ్రెడరిక్ యువకులను ఉత్తేజ పరిచేందుకు ఈ ఆటను కనుగొన్నారు. అయితే అనేక పరిణామాల తర్వాత 1928లో జిమ్నాస్టిక్స్ను ఒలింపిక్స్ క్రీడగా గుర్తించారు. అనంతరం ప్రతిదేశం తన సొంత జాతీయ పాలకమండలిని ఏర్పాటు చేసుకుంది. జిమ్నాస్టిక్స్‌లో రిథమిక్, ట్రామ్ఫోలిన్, ఏరోబిక్స్, తదితర ఈవెంట్లు ఉంటాయి. ఈ క్రీడలో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు. ఎనిమిదేళ్లుగా శిక్షణ నేను ఎనిమిదేళ్లుగా హన్మకొండలోని అకాడమీలో ఉంటూ జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పటివరకు 12 జాతీయ, 18 రాష్ట్రస్థాయి జూనియర్స్, సీనియర్స్ పోటీలకు హాజరయ్యాను. 2012లో తమిళనాడులో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో సిల్వర్, 2013లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్స్‌లో సిల్వర్ మెడల్స్ సాధించాను. అలాగే 2012లో బెంగళూరులో జరిగిన సౌత్ ఇంటర్ నేషనల్స్‌లో పాల్గొన్నాను. ఇప్పటివరకు 30 టోర్నమెంట్లలో పాల్గొని 15 సిల్వర్, 10 బ్రాంజ్ మెడల్స్ సాధించాను. – ఈ. ప్రశాంత్, డిగ్రీ సెకండియర్ పది బంగారు పతకాలు నేను పదేళ్లుగా హన్మకొండలోని అకాడమీలో జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందుతున్నాను. 2008 నుంచి ఇప్పటి వరకు మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 20 జాతీయస్థాయి, 20కి పైగా రాష్ట్రస్థాయి పోటీలకు హాజరై 10 గోల్డ్, 12 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించాను. భవిష్యత్‌లో మరింత సాధన చేసి అంతర్జాతీయస్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం. – కె. ప్రవళిక, ఇంటర్ సెకండియర్ ఆర్టిస్టిక్ విభాగంలో పట్టు నేను జిమ్నాస్టిక్స్లోని ఆర్టిస్టిక్ విభాగంలో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఆర్టిస్టిక్పై మరింత పట్టు సాధించేందుకు ఉదయం, సాయంత్రం వేళలో కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కోచ్‌ల సూచనలు పాటిస్తూ అంతర్జాతీయస్థాయిలో రాణించే విధంగా శిక్షణ పొందుతున్నాను. ఇప్పటివరకు 20 జాతీయ, 15 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. జాతీయ స్థాయిలో 10 బంగారు, 20 సిల్వర్ మెడల్స్ సాధించాను. – బి. సంజయ్‌కుమార్, డిగ్రీ సెకండియర్ -
పని చేయండి, ఫలితం కోసం చూడొద్దు
జాబ్ స్కిల్స్: సమయాన్ని వెచ్చించి, తగినంత కృషి చేస్తే కెరీర్లో అనుకున్న లక్ష్యాలను సాధించడం సులువే. చేస్తున్న పనిపై కాకుండా రాబోయే ఫలితంపైనే దృష్టి పెడితే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు.. మీ పని మీరు చేయండి, ఫలితాన్ని దైవానికి వదిలేయండి. పని ముందు, ఫలితం తర్వాత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పని చేయకుండానే విజయం వరిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. నిజంగా చాలా బాగుంటుంది. ఫలితం ముందు, పని తర్వాత అనే వెసులుబాటును ఎవరైనా ఇస్తే చాలా సమస్య లు, కష్టాలు ఉండవని అనిపిస్తుంది. కానీ, పని చేయకుండానే సక్సెస్ సాధించే అవకాశం ఎంత మాత్రం లేదు. కెరీర్లో, ఉద్యోగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే చెమటోడ్చాల్సిందే. మరో మార్గం లేదు. అయితే, చేస్తున్న శ్రమ సరిపోతుందా? లేదా? అనేది ఎప్పటికప్పుడు గుర్తించాలి. ఎంత కష్టపడినా ఆశించినది దక్కడం లేదు అని చింతిస్తూ కూర్చోవద్దు. ఇంకా ఎక్కువ శ్రమించాలి. దక్కబోయే ప్రతిఫలం కోసం చూడకుండా పనిచేసుకుంటూ ముందుకెళ్లాలి. కంఫర్ట్ జోన్.. క్షేమం కాదు చాలామంది కష్టమైన దానికంటే సులభమైన దారిలోనే వెళ్లాలనుకుంటారు. చేదు కంటే తీపినే ఎక్కువగా కోరుకుంటారు. ఏదైనా కష్టపడకుండానే సులభంగా రావాలని ఆశిస్తారు. కానీ, హార్డ్వర్క్తోనే గొప్ప విజయం వస్తుందనేది ముమ్మాటికీ నిజం. కెరీర్లో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు ఎప్పుడైనా మొదట శ్రమించడం ద్వారానే వస్తాయి. ఎక్కువ పనిచేస్తేనే ఎక్కువ విజయం సాధ్యమవుతుంది. ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్లోనే ఉండాలనుకుంటే అక్కడే ఉండిపోతారు. కెరీర్లో ఎదగాలని కోరుకునేవారికి అది అంతగా క్షేమకరం కాదు. లక్ష్యానికి చేరువ కావాలనుకుంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి, కార్యాచరణ ప్రారంభించాలి. అలాచేస్తే ఎప్పటికైనా కోరుకున్న విజయం, ప్రశంసలు, పురస్కారాలు వాటంతట అవే వస్తాయి. శ్రమ ఫలించడం తథ్యం హార్డ్వర్క్కు మరో ప్రత్యామ్నాయం లేదు. దీన్ని చాలామంది అర్థం చేసుకొని, అంగీకరిస్తారు. కానీ, కొందరు అనుకున్నది కచ్చితంగా లభిస్తుందనే హామీ ఉంటేనే కష్టపడానికి ముందుకొస్తారు. అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటామో లేదో అనే కారణంతో పనిచేయడం ఆపేస్తే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్ని సాధించేందుకు కష్టపడండి, అంతా మంచే జరుగుతుందనే ఆత్మవిశ్వాసంతో ఉండండి. రాబోయే దాని కోసం ఎదురు చూడకుండా పనిచేసుకుంటూ వెళ్లండి. అప్పుడు ఏదైనా జరగొచ్చు. ఎవరు చెప్పగలరు, మీరు కోరుకున్న దానికంటే ఎక్కువే లభించవచ్చు. హామీలు లేవు కాబట్టి, దేన్నో ఆశించి, అది రాకపోతే బాధపడొద్దు. మీలోని పూర్తి శక్తిని వెలికితీసి, పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చు. లక్ష్యాన్ని చేరుకునేదాకా శ్రమనే నమ్ముకోండి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయత్నాన్ని విరమించుకోవద్దు. శ్రమ ఎప్పటికైనా ఫలిస్తుంది. విజయం... వెంటనే రాదు అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలనే అత్యాశ, తొందరపాటు ఉండొద్దు. విజయమనేది రమ్మని పిలవగానే వచ్చేయదు. దానికి కొంత సమయం పడుతుంది. ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. సక్సెస్ వేగం తక్కువైనంత మాత్రాన అది ఇక ఎప్పటికీ రాదని అనుకోవద్దు అది నెమ్మదిగా రావడంలోనూ మంచి లాభాలే ఉంటాయి. పనిలో తప్పుల సంఖ్య తగ్గుతుంది. నైపుణ్యాలు, అనుభవం పెంచుకోవచ్చు. స్లో అండ్ స్టెడీ విన్స్ ద రేస్. ఆ పరుగు ఎంతసేపు జరుగుతుంది? ఎక్కడ ముగుస్తుంది? అనేది మీకు తెలియకపోవచ్చు. కానీ, పరుగును ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటే ఎక్కడో ఒకచోట గమ్యస్థానం తప్పకుండా తగులుతుంది.