బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహేశ్ భట్‌కు హార్ట్ సర్జరీ జరిగింది. ఇటీవలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆయన ఈ సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయాన్ని మహేశ్ తనయుడు రాహుల్ భట్ మీడియాకు వెల్లడించాడు. గత నెలలో మహేశ్ భట్ అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు వీలైనంత త్వరగా ఆయన గుండెకు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అందుకు మహేశ్ కుటుంబం అంగీకరించడంతో ఐదు రోజుల క్రితమే మహేశ్ భట్‌కు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పాడు రాహుల్.
మహేశ్ భట్ విషయానికి వస్తే ఆయన నిర్మాతగానే కాకుండా పలు సినిమాలకు రచయితగా, దర్శకుడిగానూ పని చేశారు. 1974లో వచ్చిన 'మంజీలే ఔర్ భీ హై' సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారారు. వెండితెరకు ఎన్నో హిట్స్ ఇచ్చిన ఆయన బుల్లితెరపై పలు సీరియల్స్‌ను డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన చివరి చిత్రం కార్టూన్. ఈ సినిమా తర్వాత ఆయన రచయితగా, నిర్మాతగా మారి మరెన్నో సినిమాలను రూపొందించారు.
చదవండి: నిర్మాత ఎఫైర్లు.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య
అంబానీ ఇంట్లో ఫంక్షన్.. వేసుకోవడానికి వేరే డ్రెస్సులే దొరకలేదా? నటుడిపై ఫైర్
Comments
Please login to add a commentAdd a comment