
ప్రముఖ హీరోయిన్ నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ పుట్టినరోజు నేడు.

'పోడా పోడీ' సినిమాతో దర్శకుడిగా మారిన విఘ్నేశ్.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

'నేనే రౌడీని' అని రెండో సినిమాని నయనతారతో తీశాడు. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడ్డాడు.

కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న నయనతార-విఘ్నేశ్ శివన్ 2022లో పెళ్లి చేసుకున్నారు.

ప్రస్తుతం వీళ్లకు ఇద్దరు కొడుకులు. అయితే పిల్లలిద్దరినీ సరోగసి విధానంలో కన్నారు.

ఇకపోతే విఘ్నేశ్ శివన్.. దర్శకుడిగా ఆరు సినిమాలు తీశాడు.

విఘ్నేశ్ తీసిన రెండు సినిమాల్లో నయన హీరోయిన్‌గా నటించింది.

భార్యభర్తలిద్దరూ కలిసి రౌడీ పిక్చర్స్ పేరుతో అరడజనుకి పైగా సినిమాలు తీశారు. తీస్తూనే ఉన్నారు.

తాజాగా భర్త విఘ్నేశ్ శివన్ పుట్టినరోజు సందర్భంగా నయన్ రొమాంటిక్ పోస్ట్ పెట్టింది.

'హ్యాపీ బర్త్ డే మై ఎవ్రిథింగ్. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను'

'జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని నయన్ రాసుకొచ్చింది.

ఈ పోస్ట్ బట్టి చూస్తే భర్తపై నయన బోలెడంత ప్రేమ ఉంది. అది అప్పుడప్పుడు ఇలా బయటపడుతోంది.






