
సౌత్ లేడీ సూపర్‌స్టార్ అందరికీ గుర్తొచ్చే పేరు నయనతార.

దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

ఈరోజు (నవంబర్ 18) ఈమె పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.

కేరళలో పుట్టి పెరిగిన నయన్ అసలు పేరు డయానా మరియన్ కురియమ్.

'మనసీనక్కరే' మొదటి మూవీ. ఈ సినిమా దర్శకుడు సత్యన్‌కి ఈమె పేరు నచ్చక నయనతార అని పెట్టాడు.

ఈ సినిమా ఫెయిల్ అవడంతో లోకల్ టీవీ ఛానెల్‌లో కొన్నాళ్లుగా యాంకర్‍గా చేసింది.

తమిళంలో 'అయ్య' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'గజిని'లో రెండో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది.

'గజిని', 'చంద్రముఖి' చిత్రాలు చేసిన తర్వాత నయన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

తెలుగు, తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసి తన రేంజ్ పెంచేసుకుంది.

'శ్రీరామరాజ్యం' తర్వాత నయన్ ఇక సినిమాలు ఆపేస్తుందని అనుకున్నారు కానీ అలా జరగలేదు.

స్టిల్ ఇప్పటికీ నయన్ పాన్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

ఒక్కో సినిమా చేసినందుకు గానూ ఈమెకు రూ.10-15 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్.

2022లో తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు.

ఈ పెళ్లి జరగకముందు నయన్.. రెండుసార్లు లవ్‌లో ఫెయిలైంది.

తమిళ హీరో శింబుతో కొన్నాళ్లపాటు ప్రేమలో ఉంది. అది బ్రేకప్ అయిపోయింది.

కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవాతో ఏకంగా పెళ్లి వరకు వెళ్లింది. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకుంది.

రీసెంట్‌గా హీరో ధనుష్‌పై సంచలన ఆరోపణలు, కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.














