Tamil Director Pa Ranjith Praises On Virata Parvam Movie And Team, Tweet Viral - Sakshi
Sakshi News home page

Virata Parvam Movie: ‘విరాట పర్వం’ మూవీపై ప్రముఖ తమిళ డైరెక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Published Mon, Jun 20 2022 1:43 PM | Last Updated on Mon, Jun 20 2022 6:41 PM

Tamil Director Pa Ranjith Praises Virata Parvam Movie And Team - Sakshi

టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, హీరోయిన్‌ సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం కావడంతో ప్రేక్షకులను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. అందులోనే 1990లో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన సరళ అనే యువతి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా విరాట పర్వం రూపొందింది.

చదవండి: ‘విక్రమ్‌’ మూవీలో విలన్స్‌తో ఫైట్‌ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా?

రానా కామ్రేడ్‌ రవన్న పాత్ర పోషించగా.. సాయి పల్లవి లీడ్‌రోల్‌లో కనిపించింది. ఇక ప్రియమణి, నవీన్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో రానా, సాయి పల్లవిల నటలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవి, వెంకటేశ్‌ వంటి స్టార్‌ హీరోలు ఈ మూవీని కొనియాడారు. తాజాగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ సైతం విరాట పర్వం మూవీపై స్పందించడం విశేషం. ప్రముఖ తమిళ డైరెక్టర్‌ పా రంజిత్‌ సోషల్‌ మీడియా వేదికగా విరాట పర్వం మూవీపై ప్రశంసలు కురిపించాడు. 

చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్‌ హీరో నరేష్‌ !

ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో విరాట పర్వం అత్యుత్తమైంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు ప్రశంసలకు అర్హులు. రానా వంటి స్టార్‌ హీరో ఇలాంటి పాత్రను అంగీకరించి చేసినందుకు అతడిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఇక సాయి పల్లవి అయితే చాలా అద్భుతంగా నటించింది. ఇలాంటి మంచి సినిమాను అందించిన మూవీ టీమ్‌కు స్పెషల్‌ థ్యాంక్స్‌’ అంటూ రాసుకొచ్చాడు. కాగా, విరాట పర్వం చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్లో సుధాకర్‌ చెరుకూరి, సురేశ్‌ బాబులు సంయుక్తంగా నిర్మించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement