![Buzz: Rana Daggubati Virata Parvam Release Date Preponed - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/29/virata-parvam.jpg.webp?itok=Kywd_sig)
Rana Virata Parvam Release Date Preponed: రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం విరాట పర్వం. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈమూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే కారోనా టైంలో వాయిదా పడ్డ సినిమాలన్ని వరుసగా విడుదలై మంచి విజయాలను సాధించాయి. కానీ విరాట పర్వం మాత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేకపోయింది. ఒకనొక సమయంలో ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే ఈ పుకార్లకు చెక్ పెడుతూ మేకర్స్ విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి: ‘మేజర్’ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన అడివి శేష్
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఎట్టకేలకు విరాట పర్వం విడుదల కాబోతుందని, థియేటర్లోనే ఈ మూవీ వస్తుండటంతో దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటూ సాయి పల్లవి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొదటగా అనుకున్న తేదీకంటే ముందుగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట.
చదవండి: మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్
అన్ని కుదిరితే జూన్17న ఈ చిత్రం విడుదల కానుందని సినీవర్గాల నుంచి సమాచారం. ఇక దీనిపై చిత్రబృందం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ ఉగ్గుల వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్నగా నటిస్తుండగా ప్రియమణి, నందిత దాస్, నవీన్ చంద్రలు ముఖ్య పాత్రలు పోషించారు. దగ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment