
రియాలిటీ షో డైరెక్టర్ దేవ్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు..
చెన్నై: తమిళ రియాలిటీ షో డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వానవిల్ సూపర్ స్టార్స్ షో డైరెక్టర్ దేవ్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. మలేషియాలో స్థిరపడిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కొద్ది నెలల క్రితం భారత పర్యటనకు వచ్చాడు.
ఈ క్రమంలో తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న తనకు చెన్నైలోని తన నివాసంలో దేవ్ మంచి ఆతిథ్యమిచ్చాడని గుర్తు చేసుకున్నాడు. దేవ్‌తో వుండివుంటే ఆత్మహత్య ఆలోచనలనే రానిచ్చేవాడిని కాదని, ప్రాణం తీసుకోకుండా అడ్డుకునేవాడిని అన్నాడు. కాగా దేవ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
துக்க செய்தி இங்கு 'Super Singer' போல மலேஷியாவில் Astro channel-ல் 'வானவில் சூப்பர் ஸ்டார்' என்றொரு நிகழ்ச்சி...
Posted by James Vasanthan on Saturday, 24 April 2021