Tamil Actor Vishnukanth Released Audio Of Samyuktha - Sakshi
Sakshi News home page

పెళ్లైన రెండు నెలలకే విడాకులు.. మాజీ భార్య ఆడియో క్లిప్‌ బయటపెట్టిన నటుడు

Published Sat, May 27 2023 12:47 PM | Last Updated on Sat, May 27 2023 1:29 PM

Vishnukanth Released Audio Of Samyutha - Sakshi

ప్రేమ-పెళ్లి-విడాకులు.. ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణ విషయం. కొన్ని ప్రేమలు బ్రేకప్‌తోనే ఆగిపోతే, మరికొన్ని మాత్రం పెళ్లయ్యాక విడాకులతో ముగిసిపోతాయి. తమిళ సినీ జంట సంయుక్త-విష్ణుకాంత్‌లు రెండో కోవలోకి చెందుతారు. 'సిప్పినీల్‌ ముత్తు' సీరియల్‌లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు పెద్దల అంగీకారంతో మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. బ్యూటిఫుల్‌ కపుల్‌ అని అంతా పొగిడారో లేదో అంతలోనే విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు.

పెళ్లైన రెండు నెలలకే విడాకులు
తమ పెళ్లి ఫోటోలను సైతం సోషల్‌ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. ఆ సమయంలో విష్ణుకాంత్‌.. 'మౌనంగా ఉంటే ఎఫైర్స్‌ నిజమైన ప్రేమను కూడా ఫేక్‌ ప్రేమగా మార్చేస్తాయి' అని పోస్ట్‌ చేశాడు. అటు సంయుక్తా కూడా.. 'ఇది కొత్త జీవితానికి ఆరంభం, ఇక మీదట మరింత ధృడంగా ముందుకు వెళ్తా'నని పోస్ట్‌ చేసింది. పెళ్లైన రెండు నెలలకే విడిపోయిన ఈ జంట తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. మాజీ భార్య సంయుక్త ఆడియో క్లిప్‌ను నెట్టింట రిలీజ్‌ చేశాడు విష్ణు. సంయుక్త తన మాజీ ప్రియుడు విజయ్‌తో ఇంకా టచ్‌లో ఉందని తెలియజేస్తూ ఈ క్లిప్‌ వదిలాడు. విష్ణుకాంత్‌తో పెళ్లికి సిద్ధమయ్యాక కూడా మాజీ ప్రేమికుడిని మర్చిపోలేనందువల్లే వీరు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

విష్ణు ఆమె అందాన్ని కోరుకున్నాడు
ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్‌ తమిళనాట బుల్లితెర ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది.  ఇది చూసిన కొందరు సంయుక్తను విమర్శిస్తుండగా ఆమె అభిమానులు మాత్రం మేము నీవెంటే ఉన్నామంటూ ధైర్యాన్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని.. 'విష్ణు చెప్పేది తప్పా?ఒప్పా? అనేది పక్కన పెడితే పాత ఆడియో రికార్డింగ్‌ను ఇప్పుడు నెట్‌లో పెట్టడం అనేది చాలా తప్పు. ఇక్కడ విష్ణునే సంయుక్త అందాన్ని చూసి పడిపోయి ఆమెతో శారీరకంగా కలిసి ఉండాలనుకున్నాడు. కానీ పెళ్లనేది ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వారి పెళ్లి వర్కవుట్‌ కాలేదు.

సామ్‌ ప్రేమ వ్యవహారం విష్ణుకు తెలుసు
తను నిజంగా సామ్‌ను ప్రేమిస్తే ఇలా అందరి ముందు ఆమెను అవమానపర్చడు. సామ్‌, రవి ఇద్దరూ 'నిరమతే నిలవే' అనే వెబ్‌ సిరీస్‌లో కలిసి నటించారు. ఎన్నో ఇంటర్వ్యూల్లో వారు తమ గురించి బాహాటంగానే చెప్పారు. కాబట్టి పెళ్లికి ముందే ఆమె గతం గురించి అతడికి కచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్లు నటిస్తున్నాడు. సామ్‌ ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను' అని కామెంట్‌ చేశాడు. దీన్ని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన సంయుక్త.. లవ్‌ ఎమోజీతో పాటు కృతజ్ఞతగా నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది.

చదవండి: పవిత్రా లోకేశ్‌ ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement