తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్, కమెడియన్ టీపీ గజేంద్రన్(68) కన్నుమూశారు. గతకొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుని శనివారం ఇంటికి వచ్చారు. కానీ ఆ మరునాడే తుదిశ్వాస విడవడంతో విషాదం నెలకొంది.
కాగా టీపీ గజేంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌కు క్లోజ్ ఫ్రెండ్. 1985లో చిదంబర రహస్యం సినిమాతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు టీపీ గజేంద్రన్. 1988లో వీడు మనైవి మక్కల్ మూవీతో దర్శకుడిగా మారారు. బడ్జెట్ పద్మనాభం, చీనా తానా, మిడిల్ క్లాస్ మాధవన్, బండ పరమశివం వంటి సహా తమిళంలో పలు కామెడీ చిత్రాలను తెరకెక్కించారు. దాదాపు వంద సినిమాల్లో నటించిన ఆయన చివరగా యోగిబాబు పన్ని కుట్టి చిత్రంలో కనిపించారు.
చదవండి: హీరోయిన్ ఇంట పెళ్లి సందడి.. ఫోటో షేర్ చేసిన హలో బ్యూటీ
Comments
Please login to add a commentAdd a comment