
తమిళ చిత్ర పరిశ్రమలో వినూత్న ప్రయోగాలకెప్పుడూ ఆదరణ ఉంటుందని దర్శకుడు పేరరసు అన్నారు. శివాని స్టూడియోస్ పతాకంపై సుభా సెంథిల్ నిర్మించిన చిత్రం టేక్ డైవర్షన్. శివాని సెంథిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేజీఎఫ్ చిత్రం ఫేమ్ శివకుమార్, నటి పాడినికుమార్ హీరో హీరోయిన్లుగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రం విజయం సాధించాలంటే కథే హీరోగా ఉండాలని పేర్కొన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఇంతకుముందు ఒకే నటుడితో కార్గిల్ అనే చిత్రంతో కొత్త ప్రయోగం చేసి మంచి గుర్తింపు పొందారన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో వినూత్న ప్రయోగాలకెప్పుడూ మంచి ఆదరణ ఉంటుందన్నారు.
చదవండి 👇
'మహేశ్‌బాబును ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు'
కాస్మొటిక్ సర్జరీ వెంటపడుతున్న తారలు.. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా డోంట్ కేర్!
Comments
Please login to add a commentAdd a comment