
సాక్షి, చెన్నై : ప్రముఖ తమిళ దర్శకుడు సీ శివకుమార్(46) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విరుగుమ్‌బాక్కంలోని శివకుమార్ ఇంటికి రెండు రోజులుగా తాళం వేసి ఉండటం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివకుమార్ ఇంటికి చేరుకున్న పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న ఆయన శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివకుమార్ మృతిపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా కె. భాగ్యరాజా వంటి పలువురు ప్రముఖ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శివకుమార్ ‘ఆయుధ పూజై’ సినిమాతో దర్శకుడిగా మారారు. అజిత్, అర్జున్ వంటి పలువురు ప్రముఖ హీరోలతో సినిమాలు రూపొందించిన శివకుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment