![Director Desingh Periyasamy To Marry Niranjani Agathiyan - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/26/hero_0.jpg.webp?itok=3KCRpLFJ)
తమిళ దర్శకుడు దేసింగ్ పెరియసామి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి, కాస్ట్యూమ్ డిజైనర్ నిరంజని అగత్యాన్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ విషయాన్ని నిరంజని అక్క భర్త, ఫిల్మ్‌మేకర్ తిరు ధృవీకరించాడు. ఈ మేరకు ఓ పెళ్లి పత్రికను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. పాండిచ్చేరిలో ఫిబ్రవరి 25న పెళ్లి జరగనున్నట్లు డైరెక్టర్ దేసింగ్ పేర్కొన్నారు. (చదవండి: ఘనంగా మలయాళ నటి, ట్రాన్స్ వుమెన్ పెళ్లి)
దేసింగ్ పెరియసామి 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాదిత్తల్' చిత్రం ద్వారా దర్శకుడిగా తెరంగ్రేటం చేశాడు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని, సినిమా అద్భుతంగా ఉందని సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. ఇక ఇదే చిత్రంలో ప్రముఖ దర్శకుడు అహాతియాన్ కూతురు నిరంజని అగత్యాన్ కూడా నటించగా.. చిత్రీకరణ సమయంలోనే ఆమెతో దర్శకుడు ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో వచ్చే నెలలోనే వీళ్లిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలతో పాటు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇండస్ట్రీ మిత్రుల కోసం చెన్నైలో మరో ఫంక్షన్ ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment