ప్రముఖ తమిళ దర్శక, నిర్మాత బి.అశోక్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని అళ్వార్ తిరునగర్ లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడేళ్లుగా ఆయన సినిమాలకు ఫైనాన్సియర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తులు తమ డబ్బులు తిరిగివ్వాల్సిందిగా బెదిరిస్తుండటమే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. అశోక్ కుమార్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత శశికుమార్ కు బంధువు. శశికుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఇసన్, పొరలి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. వీరి నిర్మాణంలో తెరకెక్కిన కోడి వీరం రిలీజ్ సిద్ధంగా ఉంది.
మరోవైపు అశోక్ కుమార్ మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పదించిన హీరో సిద్ధార్థ్ ' ఫైనాన్సియర్ ఒత్తిడి కారణంగా ఓ యువ కళాకారుడు మరణించటం బాధ కలిగించింది. తమిళ సినీరంగంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ప్రపంచం కేవలం పేరు, సక్సెస్ లను మాత్రమే గుర్తిస్తుంది. మొత్తం వ్యవస్థనే మార్చాల్సిన సమయం వచ్చింది. రైతైనా, దర్శకుడైనా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రావటం దారుణం'. అంటూ ట్వీట్ చేశారు.
Very painful to hear of a young man's death because of financial pressure. Tamil Cinema is full of such debt, but all the world sees are the lies of success and fame. The entire system needs overhaul. Farmer or film maker, suicide is a curse. Condolences to Sasikumar and family.
— Siddharth (@Actor_Siddharth) 22 November 2017
Comments
Please login to add a commentAdd a comment