తమిళ చిత్రసీమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు అర్పుదాన్(52) కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాగా అర్పుదాన్ తమిళంలో ఎన్నో సినిమాలు తీశారు. టాలెంట్ ఉండి అవకాశాల కోసం తిరుగుతున్న రాఘవ లారెన్స్‌ను హీరోగా పెట్టి సినిమా తీశారు. ఆ సినిమాయే అద్భుతం. ఇది 2002లో రిలీజైంది. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అప్పటికే లారెన్స్ తెలుగులో హీరోగా సినిమా చేశాడు.
తమిళంలో సైడ్ క్యారెక్టర్లు చేశాడు. అద్భుతం సినిమాతో కోలీవుడ్‌లోనూ హీరోగా మారాడు. ఈ మూవీ రాఘవ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడింది. ఇక అర్పుదాన్.. మనతోడు మళైకాలం, షామ్, సెప్పవే సిరుగాలి వంటి పలు చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో ఉదయ్ కిరణ్ హీరోగా లవ్ టుడే చిత్రానికి దర్శకత్వం వహించారు.
చదవండి: అర్జున్ చేతుల మీదుగా భార్యకు సీమంతం.. సీక్రెట్స్ చెప్పిన ఆ ముగ్గురు.. గుండె బరువెక్కడం ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment