సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్(90) కన్నుమూశాడు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు(జూన్ 3) ఉదయం 8.45 గంటలకు తుది శ్వాస విడిచాడు. నేడు సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దర్శకుడి మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా రంగరాజన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ హీరోగా 'మీందమ్ కోకిల', 'మహారసన్' వంటి పలు చిత్రాలు తెరకెక్కించాడు.
My Father, my mentor , my love ... passed away today morning around 8.45 am. Need all your prayers to keep my family in strength 🙏 pic.twitter.com/tpTfvjG474
— Gnr.kumaravelan (@gnr_kumaravelan) June 3, 2021
'కల్యాణరామన్, ఎల్లం ఇంబమాయం, కాదల్ మీంగల్, ముత్తు ఎంగల్ సొత్తు, పల్లవి మీందుమ్ పల్లవి మీందమ్ పల్లవి, అడుత్తతు ఆల్బర్ట్' వంటి చిత్రాలకు రంగరాజన్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఆయన తనయుడు జీయన్నార్ కుమారవేలన్ కూడా కోలీవుడ్‌లో దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. ఇతడు 'నినైతలే ఇనిక్కుమ్', 'యువన్ యువతి', 'హరిదాస్', 'వాగా' వంటి చిత్రాలకు డైరెక్షన్ చేశాడు. ప్రస్తుతం కుమారవేలన్ నటుడు అరుణ్ విజయ్‌తో కలిసి 'సినం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
చదవండి: భార్య మరణించిన కొన్ని రోజులకే నటుడు కన్నుమూత
లుగులో సినిమాలు చేస్తున్న బాలీ, కోలీ, మాలీ, శాండల్... వుడ్స్ డైరెక్టర్లు
Comments
Please login to add a commentAdd a comment