మధ్యలో ఆగిపోయిన స్టార్ హీరో సినిమా.. కారణం అదే..! | It's Official: Suriya opts out of director Bala Movie Vanangaan | Sakshi
Sakshi News home page

మధ్యలో ఆగిపోయిన స్టార్ హీరో సినిమా.. ఎందుకంటే?

Published Mon, Dec 5 2022 4:16 PM | Last Updated on Mon, Dec 5 2022 4:25 PM

It's Official: Suriya opts out of director Bala Movie Vanangaan - Sakshi

కోలీవుడ్‌లో తమిళ స్టార్‌ హీరో సినిమా ఆగిపోయింది. ప్రముఖ దర్శకుడు బాల, స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'అచలుడు(తమిళంలో వనంగాన్)'. అయితే పరస్పర అంగీకారంతోనే సూర్య తప్పుకుంటున్నట్లు డైరెక్టర్‌ బాల వెల్లడించారు. అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేసినందున సూర్యకు సరిపోదని దర్శకుడు అన్నారు. కథపై ఉన్న నమ్మకంతోనే సూర్య ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని.. అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు దర్శకుడు. 

త్వరలోనే మరో కొత్త హీరోతో ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు డైరెక్టర్‌ బాల తెలిపారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు 40శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన నంద, శివపుత్రుడు చిత్రాలు పలు ప్రశంసలు అందుకున్నాయి.  ఈ చిత్రంలో సూర్య మత్స్యకారునిగా కనిపించనుండగా.. కృతి శెట్టి  తమిళంలో ఈ సినిమాతో అరంగేట్రం చేయనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తుండగా.. సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డ్రామాను దాదాపు పది భాషల్లో విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement