తమిళ సినిమా 'ఐమా' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనిస్, ఎల్విన్ జులియట్ యువ జంటగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించారు. తమిళ్ ఎగ్జాటిక్ ఫిలిమ్స్ పతాకంపై షణ్ముఖ రామస్వామి నిర్మించి ప్రతినాయకుడిగా నటించారు. విష్ణు కన్నన్ ఛాయాగ్రహణం, కేఆర్ రాహుల్ సంగీతం అందించిన ఐమా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఇందులో నటుడు, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం అధ్యక్షుడు కె.రాజన్, దర్శకుడు పేరరసు, కేబుల్ శంకర్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఛాన్సులు ఎలా అడగాలో తెలియట్లేదు
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, ప్రతినాయకుడు షణ్ముఖ రామస్వామి మాట్లాడుతూ తాను ఐటీ రంగానికి చెందిన వ్యక్తినని, సినిమా రంగంపై చాలా ఆసక్తి ఉందన్నారు. తనకు నటన అంటే ఇంకా ఇష్టం అన్నారు. అయితే అవకాశాలు అడగటం తెలియదన్నారు. అందుకే నటుడు కావడం కోసమే నిర్మాతగా మారినట్లు చెప్పారు. చిత్రం బాగా వచ్చిందని తెలిపారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఐమా అంటే దైవశక్తి అని అర్థం అన్నారు. ఇందులో అధికంగా కేరళకు చెందిన కళాకారులు నటించారని పేర్కొన్నారు. స్టార్ హీరోలు నటిస్తున్న తమిళ చిత్రాల షూటింగ్‌ను ఇతర రాష్ట్రాల్లో భారీ సెట్స్ వేసి రూపొందిస్తున్నారనన్నారు.
సెల్వమణి వ్యాఖ్యలు వక్రీకరించారు..
దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన కళాకారులు, సాంకేతిక వర్గమే పని చేస్తున్నారని పేర్కొన్నారు. తమిళ చిత్రాల్లో మన కళాకారులకు, సాంకేతిక వర్గానికి పని కల్పించాలన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల పెప్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి ఒక భేటీలో పేర్కొన్నారని, దాన్ని కొందరు వక్రీకరించారని, తెలుగు నటుడు పవన్ కల్యాణ్ దీనిపై స్పందిస్తూ ఆర్‌కే సెల్వమణి వ్యాఖ్యలు సముచితం కాదని, స్వార్థ పూరితంగా ఉన్నాయని పేర్కొనడం తగదన్నారు. మన కళాకారులకు, సాంకేతిక వర్గానికి పని ఇవ్వాలని కోరడం తప్పు కాదని దర్శకుడు పేరరసు పేర్కొన్నారు.
చదవండి: గౌతమ్‌కు అన్యాయం? అప్పటిదాకా కన్నీళ్లు.. ఆ తర్వాత మాత్రం.. అబ్బో మహానటి!
Comments
Please login to add a commentAdd a comment