దర్శకుడు అమీర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఉయిర్ తమిళుక్కు. చాందిని శ్రీధర్ హీరోయిన్‌గా నటించారు. అనంద్‌రాజ్, ఇమాన్ అన్నాచ్చి, రాజ్‌కపూర్, మారిముత్తు, సుబ్రమణిశివ, మహానది శంకర్, గంజాకరుప్పు, రాజసిమ్మన్, శరవణ శక్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విద్యాసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది.
ఎవరూ ముందుకు రావట్లే
ఈ మూవీ విడుదల హక్కులను పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. శనివారం సాయంత్రం చైన్నెలో జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శక నిర్మాత ఆదంబావ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా దర్శకుడు అమీర్ హీరోగా నటించడంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.
ఆయన అలా.. ఈయన ఇలా
తనను దర్శకుడిగా పరిచయం చేసింది ఆయనేనన్నారు. అమీర్ తనకు 40 ఏళ్ల మిత్రుడని చెప్పారు. తామిద్దం మదురైకు చెందిన వారిమేనని చెప్పారు. అమీర్ మదురైలో భాషాలా ఉండేవారని, సినిమా రంగంలోకి వచ్చిన తరువాత మాణిక్యంగా మారారని, ఇప్పుడు దావూద్ ఇబ్రహీంగా మార్చుతున్నారన్నారు. అమీర్ తమిళంపై ప్రేమతో చాలా కోల్పోయారని, ఆయన సమకాలీకుడు సీమాన్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా రాణిస్తున్నారన్నారు.
ఆ అవసరం నాకు లేదు
దర్శకుడు, ఈ చిత్ర కథానాయకుడు అమీర్ మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన ఇరైవన్ మిగ పెరియవన్ చిత్ర నిర్మాత నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటుంటే తనను అందుకు బాధ్యుడిని చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిందితుడి డబ్బుపై ఆధారపడాల్సిన అవసరం నాకు లేదన్నారు. అయినా ఈ కేసు విచారణలో ఉందని, తాను ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment