విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా సినీ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. సుమారు రూ. 40 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు,తమిళ,కన్నడలో మాత్రమే విడుదలైన తంగలాన్ ఇప్పుడు హిందీలో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.
గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్‌ను తెరకెక్కించారు పా. రంజిత్. సౌత్ ఇండియా అభిమానులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతుంది. తాజాగా డైరెక్టర్ పా.రంజిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్టర్‌తో ఈ విషయం తెలిపారు. 'బంగారు వీరుడు ఆగస్టు 30న ఉత్తర భారత దేశానికి వస్తున్నాడు. ఈ ఎపిక్ స్టోరీని చూసేందుకు సిద్ధంగా ఉండండి' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కథేంటి..?
1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment