రజనీ మళ్లీ ఆయన్నే ఎందుకు ఎంచుకున్నట్టు? | Rajinikanth teams up with Ranjith for next movie | Sakshi
Sakshi News home page

రజనీ మళ్లీ ఆయన్నే ఎందుకు ఎంచుకున్నట్టు?

Published Wed, Aug 31 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

రజనీ మళ్లీ ఆయన్నే ఎందుకు ఎంచుకున్నట్టు?

రజనీ మళ్లీ ఆయన్నే ఎందుకు ఎంచుకున్నట్టు?

శంకర్‌ '2.0' సినిమా షూటింగ్‌ కొనసాగుతుండగానే.. మరో సినిమాను ఫైనలైజ్‌ చేసి.. తన అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తాడు రజనీకాంత్‌.  'కబాలి' దర్శకుడు పా రంజిత్‌తో తాను మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు సూపర్‌ స్టార్‌. ఈ సినిమాకు తన అల్లుడు ధనుష్‌ నిర్మాతగా ఉంటాడని తెలిపాడు. ఈ ప్రకటన సహజంగానే రజనీ అభిమానుల్ని థ్రిల్‌ చేసింది. సూపర్‌ హిట్‌ అయిన 'కబాలి'కి సీక్వెల్‌గా ఈ సినిమా రానున్నట్టు కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో పా రంజిత్‌ 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' పత్రికతో ముచ్చటిస్తూ తనకు మరోసారి ఎలా అవకాశం వచ్చిందో వివరించారు. 'కబాలి విడుదలైన కొన్నిరోజులకు సౌందర్య (రజనీ కూతురు) మేడం నాకు కాల్‌ చేశారు. కబాలి సినిమా పట్ల రజనీ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఆయన నన్ను కలువాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత మేం కలిశాం. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ 'నీతో పనిచేయడం ఎంతో బాగుంది.  నీకు ఓకే అయితే, మనం కలిసి మళ్లీ ఒక సినిమా చేద్దాం' అన్నారు. దీంతో నేను ఎంతో సంతోషించాను. రజనీ సర్‌ సాధారణంగా దర్శకులకు రెండో అవకాశం ఇవ్వరు. ఇప్పటివరకు చాలా తక్కువమంది ఆయన నుంచి ఈ అవకాశం పొందారు' అని రంజిత్‌ చెప్పారు.

ఈ సినిమాకు ధనుష్‌ నిర్మాతగా ఉంటారని రజనీయే చెప్పినట్టు వెల్లడించారు. అయితే, ఇది 'కబాలి' సినిమాకు సీక్వెలా? కాదా? అన్నది వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుతం తాను సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement