కబాలి కలెక్షన్లు 600 కోట్లా..? | Rajinikanths Kabali earned Rs 600 crore worldwide | Sakshi
Sakshi News home page

కబాలి కలెక్షన్లు 600 కోట్లా..?

Published Sat, Aug 6 2016 1:21 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

కబాలి కలెక్షన్లు 600 కోట్లా..?

కబాలి కలెక్షన్లు 600 కోట్లా..?

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కబాలికి సంబందించి మరో ఆసక్తికరమైన వార్త మీడియా సర్కిల్స్లో వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కబాలి డివైడ్ టాక్తో మొదలైనా.. కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేసింది. ప్రీవ్యూ షోస్ తోనే రికార్డ్లకు తెర తీసిన కబాలి, తొలి రోజు కలెక్షన్ల విషయంలో బాలీవుడ్కు కూడా సాధ్యం కాని భారీ రికార్డ్ సెట్ చేసింది.

తాజాగా ఈ సినిమా కలెక్షన్లపై వినిపిస్తున్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో థియేరట్లలో కొనసాగుతున్న కబాలి, 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కలెక్షన్లపై అఫీషియల్గా ఎలాంటి ప్రకటనా లేకపోయినా ఫ్యాన్స్ కబాలి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement