కబాలి 2లో మరో కొత్త లుక్లో రజనీ | Rajini is all set to work with Kabali director again | Sakshi
Sakshi News home page

కబాలి 2లో మరో కొత్త లుక్లో రజనీ

Published Thu, Dec 29 2016 3:04 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

కబాలి 2లో మరో కొత్త లుక్లో రజనీ

కబాలి 2లో మరో కొత్త లుక్లో రజనీ

సూపర్ రజనీకాంత్ హీరోగా ఘనవిజయం సాధించిన సినిమా కబాలి. ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తో మాత్రమే సినిమాలు చేసే రజనీ తొలిసారిగా ఓ కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా రజనీ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అందుకే కబాలి ఫీవర్ నడుస్తుండగానే ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందంటూ ప్రకటించారు చిత్రయూనిట్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టుగా సమాచారం. మరోసారి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి సినిమాకు సీక్వల్ చేస్తున్నాడు రజనీ. ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 పనుల్లో బిజీగా ఉన్న రజనీ కబాలి సీక్వల్ పని కూడా మొదలెట్టేశాడు. ఇటీవల రజనీని కలిసిన దర్శకుడు పా రంజిత్, సీక్వల్లో రజనీ లుక్, కాస్ట్యూమ్స్ పై చర్చించాడు. త్వరలోనే కబాలీ 2 సెట్స్ మీదకు వెళ్లనుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement