
రజనీకాంత్ కాలా మూవీ స్టిల్స్
సాక్షి, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా మూవీ విడుదల మరింత ఆలస్యం కానుంది. పా. రంజిత్ దర్శకత్వంలో విజయం సాధించిన ‘కబాలి’ సినిమాకు సీక్వెల్‌గా ’కాలా’ రూపొందింది. రజనీ నటించిన 2.0 (రోబో-2) కంటే ముందుగానే ఏప్రిల్ 27న కాలా విడుదలవుతుందని ఆ మూవీ యూనిట్ ఇటీవల వెల్లడించింది. కానీ కొన్ని కారణాల వల్ల మాఫియా డాన్ కరికాలన్‌గా రజనీని చూడాలంటే అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందని కోలీవుడ్ టాక్.
తమిళ సినిమా నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) తమ సమస్యల పరిష్కారం కోసం త్వరో దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కాలా విడుదల ఆలస్యం కానుంది. కావాలంటే నెల ముందుగానే విడుదల చేసుకోవాలని టీఎఫ్‌పీసీ సూచించడంతో అందుకు సాధ్యం కాదని కాలా మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మే నెలలో కాలా విడుదల కానుందని తెలుస్తోంది. కాగా మూవీ యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా, రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment