
తమిళసినిమా: బహుభాషా నటిగా రాణిస్తున్న మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహన్. మలయాళంలో కథానాయికగా పరిచయమైన ఈమె రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో శశికువర్‌కు భార్యగా నటించిన మాళవిక మోహన్ నటనకు ప్రశంశలు లభించాయి. ఆ తర్వాత విజయ్‌తో మాస్టర్ చిత్రంలో నటింంది. ఆచిత్రంలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా హిట్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత ధనుష్ సరసన మారన్ చిత్రంలో నటింంది. అలాంటిది తాజాగా విక్రమ్‌కు జంటగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో ముఖ్యపాత్రల్లో పార్వతి, నటుడు పశుపతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆ మధ్య ప్రారంభమైంది. కాగా ఈ చిత్రం విషయంలోనే నటి వళవిక మోహన్ గురించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సాధారణంగా దర్శకుడు పా.రంజిత్ చిత్రాల్లో కథానాయికలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇక తాజా చిత్రం తంగలాన్‌ను చారిత్రక కథా నేపథ్యంలో రూపొందిస్తున్నారు.
కాగా ఇందులో నటి మాళవిక మోహన్ నటన సంతృప్తి కలిగించడం లేదని, దీంతో పొరపాటున ఆమెని ఈ చిత్రానికి ఎంపిక చేశామా? అంటూ ఆయన తల కొట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించాలనే ఆలోచన వచ్చినట్లు, ఆ పాత్రకు మరో నటిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు టాక్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. వాస్తవం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment